
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో కల్కి 2 ఒకటి. గతంలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అలాగేఎందరో స్టార్స్ క్యామియో రోల్స్ లో మెరిశారు. రెండేళ్ల క్రితం రిలీజైన కల్కి 2898 ఏడీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింఇ. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడీ సైన్స్ ఫిక్షన్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక సూపర్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ చిత్రంలో మీరు కూడా భాగం అవ్వాలని అనుకుంటున్నారా? ప్రభాస్ మూవీలో నటించాలని ఉందా? మరెందుకు ఆలస్యం.. మీ టాలెంట్ చూపించే వీడియోలను పంపండి. ఈ క్రేజీ ఛాన్స్ కొట్టేయండి అంటూ క్యాస్టింగ్ కాల్ ను అనౌన్స్ చేశారు. ప్రభాస్ కల్కి సీక్వెల్ మూవీలో నటించాలనుకునే వారి కోసం క్యాస్టింగ్ కాల్ వచ్చేసింది. ఈ అరుదైన గోల్డెన్ ఛాన్స్‌ను మీ రెండు చేతులతో ఒడిసి పట్టుకోండి. నటనపై ఆసక్తి, ప్రతిభ ఉన్నవారికి ఎలాంటి షరతులు లేకుండా ఈ మూవీలో నటించే ఛాన్స్ ఇస్తామని కల్కి 2 మేకర్స్ ప్రకటించారు. ఇందు కోసం ఆసక్తిగల వారు తమ వివరాలను, పోర్ట్‌ఫోలియోలను kalkiuniversecasting@gmail.com అనే మెయిల్ చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీలోని టాలెంట్ బయటికి తీయండి... పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేయండి కల్కి టీమ్ క్యాస్టింగ్ కాల్ అనౌన్స్ మెంట్.. 📩 kalkiuniversecasting@gmail.com#Kalki2898AD #CastingCall — Kalki 2898 AD (@Kalki2898AD) August 10, 2026 కాగా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో