
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Airplane School: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం అనేది ఉపాధ్యాయులకు పెద్ద సవాలే అని చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంపై ఉన్న మోజు పిల్లలు, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడుల పట్ల ఆసక్తి తగ్గిపోయింది. అటు ప్రభుత్వం.. ఇటు ఉపాధ్యాయులు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కొన్ని చోట్ల ఫలితం శూన్యమనే అనే చెప్పాలి. అయితే రాజస్థాన్ లోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కాస్త భిన్నంగా ఆలోచించారు. విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు రోటిన్ ఆలోచనలకు కాస్త భిన్నంగా ఉండాలనుకున్నారు. పిల్లలను ఎలాగైనా ప్రభుత్వ బడిలో చేర్పించాలన్న ప్రయత్నంలో భాగంగా.. వారిని ఆకర్షించేందుకు పాఠశాల భవనాన్ని, తరగతి గదులను ఒక విమానం నమూనా రూపంలో తీర్చి దిద్దారు. బయటి నుంచి అచ్చం విమానం వలే కనిస్తుంది ప్రభుత్వ పాఠశాల. ఉపాధ్యాయుల ఈ వినూత్న ఆలోచనతో పాఠశాలలో హాజరు శాతం పెరిగింది. అంతేకాదు పాఠశాల వాతావరణాన్ని సరికొత్తగా క్రియేట్ చేయడం వల్ల పిల్లలు నిత్యం ఉత్సాహంగా పాఠశాలకు వస్తున్నారని చెబుతున్నారు. గదులకు రంగులు వేసి.. విమానం కిటికీలు, కాక్ పిట్, పైలట్ ఇమేజెస్ వంటి పెయింటింగ్స్ తో మరింత ఆకట్టుకునేలా చేశారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా మౌలిక వసతులు, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ను అందిస్తున్నారు. ఉపాధ్యాయుల వినూత్న ఆలోచన, కృషి ఫలితంగా నేడు ఆ పాఠశాలలో అడ్మిషన్లు పెరిగాయి. ఈ ఏరోప్లేస్ క్లాస్ రూమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. విమానంలో కూర్చుని చదువుకుంటున్నామనే అనుభూతి చిన్నారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు కూడా