
సూర్య ప్రకాష్ జోశ్యుల ఆ గదిలో మొత్తం 12 మంది ఉన్నారు. 11 మంది ఆమెను చూస్తున్నారు. ఒక్క ఆమె మాత్రమే... అందరినీ చదువుతోంది. టేబుల్ మీద సిగరెట్ పొగ నెమ్మదిగా పైకి ఎగురుతోంది. రికార్డర్ తిరుగుతోంది. "మీరు అతన్ని చంపారా?" అని ఒక డిటెక్టివ్ అడుగుతున్నాడు. ఆమె నవ్వుతోంది. సమాధానం చెప్పడానికి తొందరపడం లేదు. ఆమెకు తెలుసు... ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ తన కథ వినడం లేదు. తననే చూస్తున్నారు. ఆమె నెమ్మదిగా కాళ్లు మార్చి కూర్చుంటుంది. ఒక్క క్షణం. గది మొత్తం నిశ్శబ్దం. డిటెక్టివ్‌లు ప్రశ్నలు అడగడం మర్చిపోయారు. ప్రేక్షకులు ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయారు. అది కేవలం ఒక సీన్ కాదు. సినిమా చరిత్రలో... కెమెరా, సస్పెన్స్, సెడక్షన్, పవర్ అన్నీ ఒక్క ఫ్రేమ్‌లో ఎలా కలుస్తాయో చూపించిన మాస్టర్‌క్లాస్. ఆ సీన్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అభిమానులకు ఇప్పటికీ ఈ ఒక్క ఫ్రేమ్ చాలు. 'బేసిక్ ఇన్‌స్టింక్ట్'. 1992లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కల్ట్ క్లాసిక్.. తెలుగు రాష్ట్రాల్లోనూ అప్పట్లో ఈ సినిమా గురించి పెద్ద చర్చే జరిగింది. షారన్ స్టోన్ పోషించిన కేథరిన్ ట్రామెల్ పాత్ర పాప్ కల్చర్‌లో ఒక ఐకాన్‌గా మారిపోయింది.ఇప్పుడు దాదాపు 35 ఏళ్ల తర్వాత, అదే సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఒరిజినల్ రచయిత జో ఎస్టర్‌హాస్ స్క్రిప్ట్ పూర్తి చేశాడు. కానీ... "ఈసారి ఆయన తిరిగి వస్తున్నది ఒక రీబూట్ కోసం మాత్రమే కాదు. 'బేసిక్ ఇన్‌స్టింక్ట్‌కు జరిగిన అతిపెద్ద తప్పును సరిదిద్దడానికి.' "ఏంటి ఆ తప్పు? ఆ తప్పు... 2006లో జరిగింది. దాని పేరు 'బేసిక్ ఇన్‌స్టింక్ట్ 2'. ఒరిజినల్ సినిమాలో ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన ధైర్యం... పాత్రల మధ్య ఉన్న మైండ్ గేమ్. సెక్సువాలిటీ, సస్పెన్స్, వ్యంగ్యం... అన్నీ పక్కనపెట్టి, దాన్ని ఒక సాధారణ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సినిమాగా మార్చేశారు. ఇప్పుడు