ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎయిమ్స్
Actor ProfilePolitician

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎయిమ్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎయిమ్స్
Andhra Jyothy18 Oct 2026
ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎయిమ్స్

బీబీ నగర్‌ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో దక్షిణాదిలోనే అత్యాధునిక, మెరుగైన వైద్య సేవలకు కేంద్రంగా.. బీబీ నగర్‌లో 87శాతం నిర్మాణాలు పూర్తి.. ఈ ఏడాది చివరికి పూర్తిస్థాయి వైద్య సేవలు రోగుల సంఖ్య పెరిగినా సేవల్లో రాజీ పడబోం: నడ్డా యాదాద్రి/హైదరాబాద్‌, జూలై 9(ఆం ధ్రజ్యోతి): బీబీ నగర్‌ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో దక్షిణాదిలోనే అత్యాధునిక, మెరుగైన వైద్య సేవలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎయిమ్స్‌ని సందర్శించారు. వివిధ వైద్య విభాగాలను పరిశీలించారు. పాలక మండలితో సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీబీనగర్‌ ఎయిమ్స్‌ నిర్మాణ పనులు 87 శాతం పూర్తయ్యాయని, ఈ ఏడాది చివరికల్లా పూర్తిస్థాయిలో వైద్య సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ఆస్పత్రికి రోగుల సంఖ్య ఎంత పెరిగినా వైద్యుల సంఖ్య పెంచడంలో, వైద్య సేవల్లో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఇక్కడ వైద్య సేవలు, ఆధునిక వైద్య విద్య, పరిశోధనలకు సమప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం బీబీనగర్‌ ఎయిమ్స్‌లో రోజుకు 1,800 మంది అవుట్‌ పేషెంట్లకు సేవలు అందుతున్నాయని తెలిపారు. టెలీ మెడిసిన్‌, ఓపీడీ ద్వారా ఇప్పటి వరకు 1,56,000 మంది రోగులు వైద్య సేవలు పొందారన్నారు. 132 మంది ఫ్యాకల్టీ సభ్యులు, 133 మంది సీనియర్‌ వైద్యులు పనిచేస్తున్నారని చెప్పారు. వైద్య పరిశోధనల కోసం రూ.64 కోట్ల గ్రాంట్లు మంజూరయ్యాయని, 129 రీసెర్చ్‌ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఫ్యాకల్టీ సభ్యులు 156 పరిశోధన పత్రాలు సమర్పించారన్నారు. 2014 కంటే ముందు దేశంలో ఎయిమ్స్‌లు ఏడు మాత్రమే ఉండేవని, నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత 23కు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

ప రప చస థ య ప రమ ణ లత ఎయ మ స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in