
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో యుద్ధాలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ క్రమంలో మంచి రవాణా సదుపాయాలు, తక్కువ ప్రయాణ సమయం, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉండి, జీవించడానికి అత్యంత అనుకూలంగా ఉండే నగరాల జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాను ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(EIU) విడుదల చేసింది. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2026 పేరుతో ఈ నివేదిక వెలువడింది. ఈ నివేదిక ప్రకారం డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగెన్ మరోసారి ప్రపంచంలోనే నివసించడానికి అత్యంత అనుకూలమైన నగరంగా నిలిచింది.ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) విడుదల చేసిన గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2026 నివేదికలో ఈ ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ సూచీలో కోపెన్ హెగెన్ వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. పర్యావరణం, విద్య, రవాణా వంటి మూడు కీలక విభాగాల్లో ఈ నగరం పూర్తి స్థాయిలో వందకు వంద పాయింట్లు సాధించడం విశేషం. ఈ జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా రెండో స్థానంలో నిలవగా, ఆస్ట్రేలియాకు చెందిన మెల్ బోర్న్, సిడ్నీ నగరాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆసియా ఖండం నుంచి జపాన్ కు చెందిన ఒసాకా, టోక్యోలు మాత్రమే టాప్ 10 నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.ఆసియా నగరాల ముందంజ.. భారత్ స్థానం ఎక్కడ?ఈ ఏడాది ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని నగరాల్లో జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగయ్యాయి. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పటిష్టం కావడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. ముఖ్యంగా చైనాకు చెందిన ఫుజౌ వంటి నగరాలు ప్రజా ఆరోగ్య రంగంలో చేసిన భారీ పెట్టుబడుల వల్ల ఏడు స్థానాలు పైకి ఎగబాకాయి. ఇక భారత్ లోని నగరాలు అటు టాప్ 10 లోనూ, ఇటు చివరి స్థానాల్లోనూ కాకుండా మధ్యస్థ నిలకడను ప్రదర్శిస్తూ సురక్షితమైన జోన్ లోనే కొనసాగుతున్నాయి.అయితే, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు