
ప్రదీప్ రంగనాథన్ కొత్త అప్‌డేట్ ఇచ్చారు. కొంతగ్యాప్ తర్వాత ఆయనే కథ రాసి ఓ సినిమా నిర్మించనున్నారు. తన దగ్గర పనిచేసిన ఆరుగురు కుర్రాళ్లలను ‘ద ఆల్ఫా టీమ్’ పేరు పెట్టి దీనికి దర్శకత్వం వహించే బాధ్యతను అప్పగించారు. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ చిత్రాలతో హ్యాటిక్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్నారు తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). అయితే ఆయన నుంచి వచ్చిన తాజా చిత్రం ‘ఎల్‌ఐకే’ మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు ఆయన కొత్త అప్‌డేట్ ఇచ్చారు. కొంతగ్యాప్ తర్వాత ఆయనే కథ రాసి ఓ సినిమా నిర్మించనున్నారు. తన దగ్గర పనిచేసిన ఆరుగురు కుర్రాళ్లలను ‘ద ఆల్ఫా టీమ్’ పేరు పెట్టి దీనికి దర్శకత్వం వహించే బాధ్యతను అప్పగించారు. ‘పిఆర్ షో’ వర్కింగ్ టైటిల్‌తో రానున్న ఈ చిత్రంతో మమిత బైజు, అశ్వత్ మారిముత్తు కీలక పాత్రధారులు. తెలుగు నటుడు శివాజీతోపాటు శ్వాసిక, అనామిక మహి కీలక పాత్ర పోషించనున్నారు. జెన్‌జీ సెన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన లాంచ్ వీడియోను ప్రదీప్ విడుదల చేశారు. ‘మొదటిసారి రాసింది.. తీసేది నేను కాదు. ఆరుగురు యువత ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వారిని ‘ఆల్ఫా’ యూనిట్ అని పిలుస్తాం’ అని వెల్లడించారు. ప్రభాస్ ‘ఫౌజీ’ రషెస్ చూసి మైండ్ బ్లాక్ అయింది: నాగవంశీ ప్రకాష్ రాజ్.. ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావ్?: బండ్ల గణేష్ ఇంకా మొదలెట్టకుండానే.. కాంట్రవర్సీలో ‘గాడ్ ఆఫ్ వార్’