
తెలుగు కీర్తిని దశదిశలా చాటి చెప్పేందుకు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) సిద్ధమైంది. జులై 17 నుండి 19, 2026 వరకు అమెరికాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న 'టీటీఏ మెగా కన్వెన్షన్'లో భాగంగా, వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు 'టీటీఏ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్' ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అవార్డు గ్రహీతలు వీరే: జీవిత సాఫల్య పురస్కారం (Life time Achievement Award): పద్మవిభూషణ్ డాక్టర్ దువ్వూరు నాగేశ్వర రెడ్డి. జర్నలిజం రంగం (Journalism Award): వెంకట సుబ్బారావు చెన్నూరి. ఎక్సలెన్స్ అవార్డ్: డాక్టర్ ఏ.వి.గురవ రెడ్డి. తెలుగు సాంస్కృతిక & సాహిత్య పురస్కారం: వందేమాతరం శ్రీనివాస్ (కన్నెబోయిన శ్రీనివాస రావు యాదవ్). సామాజిక సేవ (Community Service Award): టి. రామచంద్ర రెడ్డి , కంది విశ్వభారత్ రెడ్డి. యూత్ అచీవ్‌మెంట్ పురస్కారం (Youth Achievements Award): డాక్టర్ రమ్య చిత్రంగడ. ఐటీ రంగం (Information Technology Award): మహిధర్ రాయసం. సైన్స్ & టెక్నాలజీ (Science & Technology Award): రవీందర్ రెడ్డి రెగట్టె. వైద్య రంగం (Medicine & Related Fields Award): ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ రవీంద్రన్. ఈ మెగా కన్వెన్షన్ నిర్వహణలో టీటీఏ అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింతా, కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి , శేఖర్ రెడ్డి నాయకత్వ బృందంగా వ్యవహరిస్తున్నారు. అడ్వైజరీ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ , ఇతర ప్రతినిధుల సహకారంతో ఈ భారీ వేడుకను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు