ప్రతి నియోజకవర్గానికీ ప్రత్యేక విజన్.. యాక్షన్ ప్లాన్ యూనిట్లతో అభివృద్ధి
Actor ProfilePolitician

ప్రతి నియోజకవర్గానికీ ప్రత్యేక విజన్.. యాక్షన్ ప్లాన్ యూనిట్లతో అభివృద్ధి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రతి నియోజకవర్గానికీ ప్రత్యేక విజన్.. యాక్షన్ ప్లాన్ యూనిట్లతో అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్
Samayam Telugu24 Nov 2026
ప్రతి నియోజకవర్గానికీ ప్రత్యేక విజన్.. యాక్షన్ ప్లాన్ యూనిట్లతో అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్

స్వర్ణాంధ్ర - 2047లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఏపీ విజన్ యాక్షన్ ప్లాన్‌పై కేంద్రం ప్రశంసలు కురిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన ఈ విధానాన్ని పరిశీలించి గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేస్తే సరిపోదని.. ఆయా నియోజకవర్గాల పరిస్థితి ఆధారంగా విజన్ ప్రణాళికలు అమలు చేస్తే అభివృద్ధి త్వరగా జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఈ స్వర్ణాంధ్ర - 2047 అమలులో భాగంగా 175 నియోజకవర్గాల్లోనూ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను ఏర్పాటు చేసింది. ఒక్క క్లిక్‌తో సమాచారం తెలుసుకునేలా ప్రత్యేక వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. వీటితో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందన్న డేటా ప్రభుత్వానికి, దాన్ని పర్యవేక్షించే వ్యవస్థలకు ఎప్పటికప్పుడు చేరుతోంది. విజన్ యాక్షన్ ప్లాన్ (సీవీఏపీ) భాగంగా నియోజకవర్గ స్థాయిలో శాఖల మధ్య సమన్వయం, సమాచారం, సేకరణ, ఫలితాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి, యువ నిపుణులు, సెక్టార్ కో ఆర్టినేటర్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు అభివృద్ధఇ కార్యక్రమాల వివరాలు సేకరించి.. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తారు.READ ALSO ఒంగోలులో కూటమి నేతల కుమ్ములాట.. బాలినేని వర్సెస్ దామచర్ల.. ఒకరిపై ఒకరు వార్నింగ్‌లు!ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం, సంతృప్తిస్థాయి ఎలా ఉంది? ఇలాంటి వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తారు. ప్రణాళికల రూపకల్పన, అమల్లో భాగంగా నియోజకవర్గం ప్రొఫైల్‌తో వెబ్‌సైట్ ఏర్పాటు చేశారు. ప్రధాన పేజీల్లో నియోజకవర్గ సమాచారం కూడా కనిపిస్తుంది. మొత్తం మండలాలు, చారిత్రక అంశాలు, పర్యాటక ప్రాంతాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, సేవారంగం వాటి ప్రాధాన్యం తదితర వివరాలుంటాయి.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దీంట్లో ప్రతి మండాలనికీ 2024-25 నుంచి 2028-29 వరకు విజన్ ప్రణాళికలున్నాయి. తాజా వివరాలతో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు. వ్యవసాయం ఆధారంగా ఆ మండలాలు ఉంటే.. ఏటా ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు సాగు చేయిస్తే ఎంత ఆదాయం

ప రత న య జకవర గ న క ప రత య క వ జన య క షన ప ల న య న ట లత అభ వ ద ధ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in