
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో అత్యాధునిక వసతులతో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రతి ఆరు నెలలకోసారి ఒక ప్రధాన ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా సీఎం కీలక ప్రకటన చేశారు.ఉస్మానియా జనరల్ ఆసుపత్రి పునర్నిర్మాణంతో పాటు ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2027 డిసెంబర్ నాటికి ఈ ఆసుపత్రులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో అదనంగా 10 వేల పడకలను అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం టిమ్స్ ఆసుపత్రులకు కేవలం శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకుందని, తమ ప్రభుత్వం వాటిని పూర్తి చేసి ఆచరణలో చూపిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన 32 నెలల పాలనలో ప్రజారోగ్యంపై రూ. 21,800 కోట్లు ఖర్చు చేసిందని, ఇందులో ఆరోగ్యశ్రీ కింద రూ. 2,700 కోట్లు, సీఎం సహాయ నిధి నుంచి రూ. 2,500 కోట్లు వెచ్చించామని తెలిపారు. వైద్యం, విద్యపై పెట్టే ఖర్చును తాము భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడిగా భావిస్తామని ఆయన పేర్కొన్నారు.అదనపు పని గంటలు కేటాయించే సూపర్ స్పెషాలిటీ