
సంగారెడ్డి టౌన్: ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పిలుపునిచ్చారు. జైల్ భరో కార్యక్రమంలో భాగంగా కొత్త బస్టాండ్ వద్ద సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మికల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జైల్ భరో కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పెట్టుబడిదారులకు దేశ సంపదను దోచిపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్య, వైద్యం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్‌లతో కార్మికులు తమ హక్కులను కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు