
Telugu Times•15 Jan 2027
ప్రజా ఉద్యమాలకు చిరునామా గద్దర్ప్రజా ఉద్యమాలకు చిరునామా గద్దర్ (Gaddar) అని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) కొనియాడారు. హైదరాబాద్‌లో ప్రజా యుద్ధ నౌక గద్దర్ డాక్యుమెంటరీ పోస్టర్ (Documentary poster)ను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్దర్ వంటి మహనీయుడి డాక్యుమెంటరీ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అభినందనీయం. ఆయన ఆశయాలను, పోరాట స్ఫూర్తిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గద్దర్ కుమార్తె, సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల (Vennela), చిత్ర నిర్మాతలు, దర్శకులు, నటీనటులు పాల్గొన్నారు