ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
Actor ProfilePolitician

ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
Eenadu28 Nov 2026
ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

విజయనగరం రూరల్‌: ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు, వినతులను సత్వరమే పరిష్కరించి ప్రభుత్వ సేవలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా అన్ని శాఖల అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్, ఐవీఆర్ఎస్ సర్వే ఫీడ్‌బ్యాక్‌లు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార స్థితిగతులు తదితర అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజలు నమోదు చేస్తున్న ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిగణించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలపై ప్రజా సానుకూలతను పెంచాలని ఆదేశించారు. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలు ప్రభుత్వ సేవల నాణ్యతను అంచనా వేయడంలో కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతికూల ఫీడ్‌బ్యాక్ వచ్చిన ప్రతి అంశాన్ని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ప రజల ఫ ర య ద లన సత వరమ పర ష కర చ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in