ప్రజలకూ ఏఐ బూమ్ లాభాలు.. తైవాన్ లో ప్రతి పౌరుడికి రూ.30 వేల నగదు
Actor ProfilePolitician

ప్రజలకూ ఏఐ బూమ్ లాభాలు.. తైవాన్ లో ప్రతి పౌరుడికి రూ.30 వేల నగదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రజలకూ ఏఐ బూమ్ లాభాలు.. తైవాన్ లో ప్రతి పౌరుడికి రూ.30 వేల నగదు
AP7AM19 Jan 2027
ప్రజలకూ ఏఐ బూమ్ లాభాలు.. తైవాన్ లో ప్రతి పౌరుడికి రూ.30 వేల నగదు

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగం దూసుకుపోతుండటంతో తైవాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊపు వచ్చింది. ఈ వృద్ధి ఫలాలను ప్రజలతోనూ పంచుకోవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి పౌరుడికి 10 వేల తైవాన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.30 వేలు) నగదు అందించే ప్రతిపాదనను అధ్యక్షుడు లై చింగ్-తే ముందుకు తీసుకొచ్చారు. దీనిని ఆయన ‘ఏఐ డివిడెండ్’గా అభివర్ణించారు.ఏఐ, అధునాతన సెమీకండక్టర్లు, హై-పర్‌ఫార్మెన్స్ కంప్యూటింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డిమాండ్‌తో తైవాన్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. 2026 తొలి ఆరు నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థ 14.15 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది మొత్తం వృద్ధి అంచనాను ప్రభుత్వం 11.05 శాతానికి పెంచింది.కొత్త అప్పులు లేకుండానే..ఈ నగదు పంపిణీ కోసం కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఏఐ, టెక్నాలజీ రంగాల వృద్ధితో పెరిగిన ప్రభుత్వ ఆదాయాన్ని ఇందుకు వినియోగించనున్నారు. 2027 కేంద్ర బడ్జెట్‌కు ఈ ఏడాది చివర్లో శాసనసభ ఆమోదం లభిస్తే, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లూనార్ న్యూ ఇయర్‌కు ముందే నగదు పంపిణీ చేసే అవకాశం ఉంది.ప్రజలు ఈ నగదును తమకు అవసరమైన విధంగా వినియోగించుకోవచ్చని అధ్యక్షుడు లై తెలిపారు. విద్య, వృద్ధుల సంరక్షణ, కుటుంబ అవసరాలు లేదా షాపింగ్‌కు ఖర్చు చేసుకోవచ్చని సూచించారు.40 ఏళ్లలో అత్యధిక వృద్ధిప్రపంచ ఏఐ బూమ్‌కు తైవాన్ అతిపెద్ద లబ్ధిదారుల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా అధునాతన చిప్స్, ఏఐ సర్వర్లు, క్లౌడ్ కంప్యూటింగ్ పరికరాల సరఫరాలో

ప రజలక ఏఐ బ మ ల భ ల త వ న ల ప రత ప ర డ క ర 30 వ ల నగద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in