
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. e-PAN Card Online Free: పాన్ కార్డు అనేది మనందరకీ ఎంతో కీలకమైన కార్డు. ఐటీఆర్ లేదా ఏవైనా లావాదేవీలు రూ.50,000 కంటే ఎక్కువ చేస్తే పాన్ కార్డు వివరాలు నమోదు తప్పనిసరి. ఇంతకు ముందు పాన్ కార్డు పొందాలంటే ఫారమ్ నింపాల్సి ఉండేది. మెయిల్ వచ్చే వరకు కూడా కొన్ని వారాల సమయం పట్టేది. ఇప్పుడు ఆ ఎదురు చూపులు అవసరం లేదు.. ఏజెంట్‌లకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో అన్నీ సేవలు ఆన్‌లైన్‌లోనే పొందే సౌలభ్యం వచ్చింది. అయితే, ఆదాయపు పన్ను డిపార్ట్‌మెంట్ 'ఇన్‌స్టెంట్ ఇ-పాన్' సర్వీస్ అందిస్తోంది. దీంతో ఇంట్లోనే కేవలం 10 నిమిషాల్లో పాన్ నెంబర్ పొందవచ్చు. ఆ ప్రక్రియ తెలుసుకుందాం. పాన్ కార్డుకు దరఖాస్తు చేయాలంటే 12 అంకెల ఆధార్ నెంబ్ కూడా కలిగి ఉండాల్సిందే.. దీనికి రిజిస్టర్ మొబైల్ లింక్ అయి ఉండాలి. ఇది వరకు పాన్ కార్డు లేనివారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇ-పాన్ ప్రక్రియకు డీజీ లాకర్ యాక్సెస్ తప్పనిసరి. అంతేకాదు పుట్టిన తేదీ రుజువు కూడా తప్పనిసరి. దరఖాస్తుదారుడు మేజర్ అయి ఉండాలి. ఇ-పాన్ దరఖాస్తు చేసే విధానం.. ఇ-పాన్‌కు స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇ-ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ చేయాలి అక్కడ ఇన్‌స్టెంట్ ఇ-పాన్ అనేది హోంపేజీలో ఎడమవైపు క్విక్ లింక్స్‌లో అందుబాటులో ఉంటుంది. గెట్ న్యూ ఇ-పాన్ బట్టన్ క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ నమోదు చేసి డిక్లరేషన్ బక్స్ చెక్ చేయాలి. ఆ తర్వాత కంటిన్యూ