
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. High tension at narsampet amid peddi sudarshan statue pedestal demolish: దివంగత బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహంను ఏర్పాటు చేసేందుకు నర్సంపేట్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీకిఎదురుగా ఉన్న ప్రైవేటు స్థలంలో గద్దెను నిర్మించారు. అయితే.. అధికారులు దీన్ని రాత్రికి రాత్రి పూట కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అసలు ప్రైవేటు స్థలంలో విగ్రహం ఏర్పాటు చేస్తే మీకు వచ్చిన నష్టంఏంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం రాజకీయంగా కక్ష సాధింపులకు దిగడం అంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అధికారులు గద్దెను కూల్చివేయడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. దీంతో..ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడ పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు గద్దె కూల్చిన స్థలం వద్ద ఆందోళనకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ నల్లబెల్లిలో జరిగే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో పాల్గొనేందుకు బయలు దేరారు. ఈ గద్దె కూల్చివేత పరిణామంతో నర్సంపేట్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా బలగాల్ని మోహరించారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం