పెద్ద స్కెచ్చే వేశారు.. భారత్ నుంచి పాకిస్తాన్ మీదుగా ఆ దేశానికి రైల్వే లైన్
Actor ProfilePolitician

పెద్ద స్కెచ్చే వేశారు.. భారత్ నుంచి పాకిస్తాన్ మీదుగా ఆ దేశానికి రైల్వే లైన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెద్ద స్కెచ్చే వేశారు.. భారత్ నుంచి పాకిస్తాన్ మీదుగా ఆ దేశానికి రైల్వే లైన్
Asianet News Telugu15 Dec 2026
పెద్ద స్కెచ్చే వేశారు.. భారత్ నుంచి పాకిస్తాన్ మీదుగా ఆ దేశానికి రైల్వే లైన్

సాంప్రదాయ సముద్ర మార్గాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆసియా మార్కెట్లతో ముఖ్యంగా భారత్, ఆసియా ప్రాంతంతో భూమార్గం ద్వారా రవాణా అనుసంధానాన్ని పెంచుకోవడానికి రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికోసం తుర్క్మెనిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మీదుగా రైలు మార్గాన్ని నిర్మించే అవకాశాలను రష్యా మొదలుపెట్టింది. ఈ విషయాన్ని రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరాత్ ఖుస్నుల్లిన్ అధికారిక వార్తా సంస్థ 'టాస్' (TASS) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. బోస్ఫరస్ జలసంధి, హోర్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర జలమార్గాల్లో తలెత్తుతున్న ముప్పుల దృష్ట్యా రైలు మార్గం ఏర్పాటు చేయడంపై సమగ్ర విశ్లేషణ జరగాలని ఆయన స్పష్టం చేశారు. భారత్‌కు కనెక్టివిటీ ఇచ్చే ఏ రకమైన ఆప్షన్ అయినా తమకు ఒకే అని ఆయన పేర్కొన్నారు. రష్యా డిప్యూటీ పీఎం చేసిన వ్యాఖ్యలు రష్యా నుండి భారత్‌కు వెంటనే డైరెక్ట్ ప్యాసింజర్ లేదా ఫ్రైట్ రైలును ప్రారంభించేస్తున్నారని అర్థం కాదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేంద్ర ఆసియా, మధ్యప్రాచ్యం మీదుగా రష్యాను భారత్‌తో కలిపే భూతల రవాణా నెట్‌వర్క్ విస్తరణ ఆలోచనలో భాగం మాత్రమే. ప్రస్తుతం రష్యా, భారత్, ఇరాన్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (INSTC) సుమారు 7,200 కిలోమీటర్ల పొడవునా రైలు, రోడ్డు, సముద్ర మార్గాల కలయికతో నడుస్తోంది. దీని పశ్చిమ మార్గం రష్యా, అజర్బైజాన్, ఇరాన్ మీదుగా వెళ్తుండగా, తూర్పు మార్గం కజాఖ్స్తాన్, తుర్క్మెనిస్తాన్ ద్వారా ఇరాన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి సముద్ర మార్గంలో సరుకులు భారత్‌కు చేరుకుంటాయి. అయితే ఇప్పుడు ప్రతిపాదనలో ఉన్న కొత్త మార్గం ఈ రవాణాను మరింత ఈజీగా మార్చేందుకు ఉద్దేశించింది. ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి ద్వారా గ్లోబల్ ఆయిల్ ఎగుమతుల్లో 25 శాతం, ద్రవీకృత సహజ వాయువు ఎగుమతుల్లో 20 శాతం జరుగుతాయి. అలాగే నల్లసముద్రం, మర్మారా సముద్రాన్ని కలిపే