పెద్దాయన చల్లా రాజేంద్రప్రసాద్ దాతృత్వం.. ప్రభుత్వ గ్రంథాలయం కోసం రూ.20 కోట్లు విరాళం
Actor ProfilePolitician

పెద్దాయన చల్లా రాజేంద్రప్రసాద్ దాతృత్వం.. ప్రభుత్వ గ్రంథాలయం కోసం రూ.20 కోట్లు విరాళం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెద్దాయన చల్లా రాజేంద్రప్రసాద్ దాతృత్వం.. ప్రభుత్వ గ్రంథాలయం కోసం రూ.20 కోట్లు విరాళం
Samayam Telugu2 Jan 2027
పెద్దాయన చల్లా రాజేంద్రప్రసాద్ దాతృత్వం.. ప్రభుత్వ గ్రంథాలయం కోసం రూ.20 కోట్లు విరాళం

గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం ఆధునికీకరించే దిశగా కీలక ముందడుగు పడింది. ఈ గ్రంథాలయం నిర్మాణం కోసం సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ (ఇండియా) వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ చల్లా రాజేంద్రప్రసాద్ పెద్దమనసుతో సహకారం అందించనున్నారు. ఈ గ్రంథాలయ నిర్మాణాన్ని దాత చల్లా రాజేంద్రప్రసాద్‌ రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారన్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాత చల్లా రాజేంద్రప్రసాద్‌, పౌర గ్రంథాలయ సంస్థ సంచాలకులు ఎ.కృష్ణమోహన్‌ ఎంవోయూ చేసుకున్నారు. చల్లా రాజేంద్రప్రసాద్ గొప్ప మనసుతో రూ.20 కోట్లు ఖర్చు చేయనున్నారు.. ఆయన దాతృత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.గుంటూరులోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మాధవి, చల్లా రాజేంద్రప్రసాద్, అధికారులు పరిశీలించారు. చల్లా రాజేంద్రప్రసాద్‌ వరల్డ్‌ లార్జెస్ట్‌ కాఫీ ఎక్స్‌పోర్టర్‌గా పేరున్న వెయ్యికి పైగా కాఫీ బ్రాండ్లను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌. రాజేంద్రప్రసాద్ సహకారంతో రూ.20 కోట్లతో ఈ గ్రంథాలయాన్ని సెల్లార్‌+జీ+2 ప్రణాళికతో భవన నిర్మాణం చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న భవనాన్ని కూల్చివేసి త్వరలోనే మంత్రి లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామన్నారు.ఈ గ్రంథాలయం 1915లో ప్రారంభమై.. దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్థులకు జ్ఞాన కేంద్రంగా నిలిచిందన్నారు పెమ్మసాని. ఇప్పుడు ఆధునిక సదుపాయాలతో మరింత మెరుగైన వాతావరణాన్ని విద్యార్థులకు అందించేందుకు నూతన భవనం నిర్మించబోతున్నామన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తూ, గుంటూరును విద్యా కేంద్రంగా మరింత బలోపేతం చేయడం తమ లక్ష్యమన్నారు. 1915లో బ్రిటీష్‌వాళ్లు ఉన్న సమయంలో కమ్యూనిటీ హల్‌గా ప్రారంభమై.. 1958లో స్టేట్ రీజినల్ లైబ్రరీగా కన్వర్ట్ చేశారన్నారు.'ప్రస్తుతం గ్రంథాలయం ఉన్న ఈ భవనం పెచ్చులూడిపోతున్నాయి.. ఈ గ్రంథాలయాన్ని వరల్డ్ క్లాస్‌గా అభివృద్ధి చేయడానికి డబ్బులు ఎక్కువగా కావాలి. ఆ సమయంలో దాతల కోసం చూస్తున్న సమయంలో చల్లా రాజేంద్రప్రసాద్ ముందుకు వచ్చారు. ఫర్నీచర్ నుంచి అన్ని ఖర్చులు రాజేంద్రప్రసాద్ భరిస్తారు.. గంథ్రాలయానికి రాజేందప్రసాద్ సూచించిన పేరు పెట్టడానికి ప్రభుత్వం కూడా అనుమతి

ప ద ద యన చల ల ర జ ద రప రస ద ద త త వ ప రభ త వ గ ర థ లయ క స ర 20 క ట ల వ ర ళ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in