
సీఈఏ వి.అనంత నాగేశ్వరన్, డీఈఏ ఆకాష్ పూజారి వ్యాఖ్యలు పాత వాహనాలను వినియోగించే కోట్లాది మంది ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ఇథనాల్ (ఈ10) కలిగిన పెట్రోల్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్, ఆర్థిక వ్యవహారాల శాఖ కన్సల్టెంట్ ఆకాష్ పూజారి సూచించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో 20 శాతం ఇథనాల్ కలిగిన ఈ20 పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉంది. ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, దేశీయ వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా గతేడాది ఈ20ని ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 1 నుంచి బంకుల్లో విక్రయించే పెట్రోల్‌కు ఇదే ప్రామాణికంగా మారింది. ఈ20 పెట్రోల్ వాడకం వల్ల బీఎస్–6కు ముందు మోడల్ వాహనాల మైలేజీ తగ్గడంతో పాటు ఆటో విడిభాగాలు దెబ్బతినడం వంటి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే, ఈ ఆరోపణలను పెట్రోలియం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చుతూ వస్తోంది. పలు రకాల ఇంధనాలను ఏకకాలంలో సరఫరా చేసేందుకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేసి నిర్వహించడం సాధ్యం కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఈ ఫిర్యాదులను పూర్తిగా తోసిపుచ్చడం సరికాదని అనంత నాగేశ్వరన్, ఆకాష్ పూజారి ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో రాసిన అభిప్రాయ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ అభిప్రాయాలు తమ వ్యక్తిగతమైనవని స్పష్టం చేశారు. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో శక్తి తక్కువగా ఉండటంతో ఈ20 వాడకం వల్ల లీటరుకు వాహనం ప్రయాణించే దూరం కొంత తగ్గుతుందని నాగేశ్వరన్, పూజారి అంగీకరించారు. అయితే దీని ప్రభావం 6–7 శాతం మేరకే ఉంటుందని అంచనా వేశారు. ఈ20కు అనుకూలంగా రూపొందించిన వాహనాల్లో ఇంజిన్ అరుగుదల పెరుగుతుందనడానికి భారత్, అమెరికాలో నిర్వహించిన పరీక్షల్లో ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. ఇథనాల్ విధానం వల్ల చెరకు రైతులకు బకాయిల చెల్లింపులు వేగవంతం కావడం, గ్రామీణ ఆదాయా లు పెరగడం వంటి సానుకూల ఫలితాలు ల భించాయని నాగేశ్వరన్, పూజారి