
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Gold Discovery In Belgium: ఇంటికి సాధారణ మరమ్మతులు చేస్తుండగా కూలీలకు అనుకోకుండా కోట్ల రూపాయల విలువైన బంగారు నిధి లభించింది. బెల్జియంలో వెలుగు చూసిన ఈ అరుదైన ఘటన ప్రస్తుతం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. గోడ వెనుక దాగిన నిధి.. అసలేం జరిగింది? బెల్జియంలోని తూర్పు ఫ్లాండర్స్ ప్రాంతంలో ఓ పాత ఇంట్లో మురుగునీటి పైపులు మార్చే పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా కార్మికులు ఇంటి పునాది వద్ద గోడకు డ్రిల్లింగ్ చేస్తుండగా.. లోపలి నుంచి పసుపు రంగు వస్తువులు బయటపడ్డాయి. మొదట అయోమయానికి గురైన కూలీలు మరింత లోతుగా తవ్వగా, గుట్టలు గుట్టలుగా బంగారు ఆభరణాలు, నాణేలు, గోల్డ్ బిస్కెట్లు దర్శనమిచ్చాయి. రూ. 100 కోట్ల విలువైన బంగారం! ఈ పనులలో వేసవి సెలవుల్లో పనిచేయడానికి వచ్చిన 18 ఏళ్ల కోబీ అనే యువకుడు కూడా ఉన్నాడు. మొదట అతను ఆ నాణేలను సాధారణ 1 యూరో నాణేలుగా భావించాడు. కానీ కొద్దిసేపటికి అక్కడ బంగారు కడ్డీలు కనిపించడంతో అది కోట్ల విలువైన నిధి అని అందరూ గ్రహించారు. కార్మికులు కనుగొన్న ఈ నిధి మొత్తం విలువ సుమారు 9 మిలియన్ యూరోలు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ అద్భుత ఆవిష్కరణ అందరినీ విస్మయానికి గురిచేసింది. బంగారం యజమాని ఎవరు? చట్టం ఏం చెబుతోంది? బంగారం లభించిన ఆ భవనం స్థానికంగా సేవలందిస్తున్న 'CAW ఊస్ట్ - వ్లాండరెన్' సంస్థకు చెందినదిగా తేలింది