పాడైన నోట్లను మార్చడానికి బ్యాంకు నిరాకరిస్తోందా? మీరు కంప్లైంట్ చేయొచ్చు తెలుసా
Actor ProfilePolitician

పాడైన నోట్లను మార్చడానికి బ్యాంకు నిరాకరిస్తోందా? మీరు కంప్లైంట్ చేయొచ్చు తెలుసా

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
తెలుగులో ఆఫర్లు కరువు.. సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచిన రాశీఖన్నా
TV9 Telugu21 Nov 2026
తెలుగులో ఆఫర్లు కరువు.. సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచిన రాశీఖన్నా

దాదాపు దశాబ్ద కాలంగా వెండితెర మీద కొనసాగుతున్నా... స్టార్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు గ్లామర్ క్వీన్ రాశీఖన్నా. అందుకే... ట్రెండ్ మార్చి డిజిటల్ ఆడియన్స్‌కు చేరువయ్యేందుకు

పాడైన నోట్లను మార్చడానికి బ్యాంకు నిరాకరిస్తోందా? మీరు కంప్లైంట్ చేయొచ్చు తెలుసా
TV9 Telugu21 Nov 2026
పాడైన నోట్లను మార్చడానికి బ్యాంకు నిరాకరిస్తోందా? మీరు కంప్లైంట్ చేయొచ్చు తెలుసా

రోజువారీ లావాదేవీల్లో మనకు తరచూ చిరిగిన, మురికిగా మారిన లేదా పాడైపోయిన కరెన్సీ నోట్లు వస్తుంటాయి. వీటిని వ్యాపారులు లేదా దుకాణదారులు తీసుకోవడానికి నిరాకరించినప్పుడు ఆందోళన చెందుతుంటాం. అయితే, ఆ నోట్ల వల్ల మీ డబ్బేమీ వృథా కాదు. ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం పాడైన నోట్లను ఉచితంగా మార్చుకునే చట్టబద్ధమైన హక్కు పౌరులకు ఉంది. ఆర్‌బిఐ నోట్ రీఫండ్ రూల్స్ 2009, 2018 సవరణల ప్రకారం.. దేశంలోని ఏ వాణిజ్య బ్యాంకు శాఖలోనైనా చిరిగిన లేదా పాడైన నోట్లను మార్చుకోవచ్చు. దీని కోసం సంబంధిత బ్యాంకులో మీకు ఖాతా ఉండాల్సిన అవసరం కూడా లేదు. పదేపదే వాడటం వల్ల మురికిగా మారిన నోట్లు, రెండు లేదా అంతకంటే ఎక్కువ ముక్కలైనవి, కొంత భాగం లేకపోయినా లేదా ప్రింటింగ్ లోపాలు ఉన్న నోట్లను బ్యాంకులు కచ్చితంగా స్వీకరించి వాటి విలువను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ బ్యాంకైనా మీ వద్ద ఉన్న పాడైన నోట్లను మార్చడానికి నిరాకరిస్తే, మీరు వారిపై చర్యలు తీసుకోవచ్చు. ఇందుకోసం.. ముందుగా సంబంధిత బ్రాంచ్ మేనేజర్‌ను సంప్రదించి, అక్కడ ఉండే ఫిర్యాదుల రిజిస్టర్‌లో మీ సమస్యను రాతపూర్వకంగా నమోదు చేయాలి. బ్యాంకు అంతర్గత ఫిర్యాదుల పరిష్కార విభాగానికి స్పందించడానికి నెల రోజుల సమయం పడుతుంది. ఒకవేళ నెలరోజులు దాటినా సమస్య పరిష్కారం కాకపోయినా, బ్యాంకు ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోయినా నేరుగా ఆర్‌బిఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. వినియోగదారులు ఎటువంటి రుసుము చెల్లించకుండా ‘ఆర్‌బిఐ CMS పోర్టల్’ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా ‘14448’ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఉచితంగా ఫిర్యాదు చేయవచ్చు. కరెన్సీ నోట్లు జాతీయ ఆస్తి. కాబట్టి పాడైన నోట్లను తక్కువ ధరకు బయట ఇచ్చి నష్టపోకుండా వెంటనే సమీప బ్యాంకు శాఖను సంప్రదించి మార్చుకోండి. Bigg Boss Season 10: బిగ్ సర్‌ప్రైజ్‌.. బిగ్ బాస్‌ ఆ రోజు నుంచి మొదలు.. డ్యూటీకి డుమ్మా కొట్టి

ప డ న న ట లన మ ర చడ న క బ య క న ర కర స త ద మ ర క ప ల ట చ య చ చ త ల స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in