పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఆటగాళ్ల
Actor ProfileCelebrity

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఆటగాళ్ల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం.. ఎందుకంటే
Zee Telugu26 Nov 2026
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం.. ఎందుకంటే

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. PCB Bans Pakistan Cricketers: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సంచలన నిర్ణయం తీసుకుంది. బోర్డు ముందస్తు అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా జాంబియాలో నిర్వహించిన అనధికారిక టీ20 లీగ్‌లో పాల్గొన్నందుకు పలువురు మాజీ పాకిస్థాన్ క్రికెటర్లపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది. జాంబియా రాజధాని లుసాకా వేదికగా 'ఏషియన్ లెజెండ్స్ లీగ్' పేరిట ఆగస్టు 2 నుంచి ఒక టీ20 టోర్నమెంట్ ప్రారంభం జరిగింది. ఇందులో ఏషియన్ స్టార్స్, పాకిస్థాన్ పాంథర్స్, అఫ్గానిస్థాన్, శ్రీలంక పేర్లతో జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు గతేడాది నుంచి ప్రచారం చేస్తున్నారు. ఈ లీగ్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్, వికెట్ కీపర్ కామ్రాన్ అక్మల్, ఆల్‌రౌండర్ సొహైల్ తన్వీర్, ఆఫ్ స్పిన్నర్ జాహిద్ మహమూద్ తదితరులు లుసాకా వెళ్లారు. అయితే లీగ్ వివరాలను ఆరా తీయగా.. దీనికి జాంబియా క్రికెట్ యూనియన్ (ZCU) నుంచి ఎలాంటి అధికారిక ఆమోదం లేదని తేలింది. ఈ విషయాన్ని జాంబియా క్రికెట్ యూనియన్ స్వయంగా ధృవీకరించింది. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఆడాల్సి ఉంది. అయితే అధికారిక గుర్తింపు లేదని తెలుసుకున్న రాయుడు.. జాంబియా నుంచి వెనక్కి వచ్చాడు. రాయుడితోపాటు పాక్ ఆటగాళ్లు మహమ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ వంటి కొందరు ఆటగాళ్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వెంటనే స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే ఇమ్రాన్ నజీర్, తౌఫీక్ ఉమర్, యాసిర్ షా, హసన్ రజా, రాహత్ అలీ, మహమ్మద్ ఇర్ఫాన్, యాసిర్ భట్, అబ్రార్ హుస్సేన్, రాణా అన్వర్ వంటి మరికొందరు