Pakistan Award Mumbai Doctors : భారత్-పాకిస్థాన్ విభజన ఎంత మంది మనసులను కలిచి వేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ దేశ విభజన వెనుక ఓ అనూహ్యమైన రహస్యం దాగి ఉందనే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా పాకిస్థాన్ జాతిపితగా భావించే మహమ్మద్ అలీ జిన్నా తీవ్రమైన ప్రాణాంతక టీబీ వ్యాధితో బాధ పడుతున్నారనే విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచి ఉంచడం వల్లే పాక్ ఏర్పడిందని.. దానికి కారణం ముంబైకి చెందిన ఇద్దరు పార్శీ వైద్యులే కాగా.. పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పుడు వారికి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్-ఎ-ఇంతియాజ్’ను ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.దేశ ఆవిర్భావానికి దోహదపడిన రహస్య నివేదికదేశ విభజన జరిగే నాటికే జిన్నా ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా దిగజారిపోయింది. ఆయన మరో రెండేళ్లకు మించి బతికే అవకాశం లేదనే స్థాయికి టీబీ వ్యాధి ముదిరింది. అయితే ఆ సమయంలో ముంబైకి చెందిన వైద్యులు డాక్టర్ జల్ రతన్‌జీ పటేల్, డాక్టర్ జల్ ధాయ్‌భోకూలు ఈ అనారోగ్య విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. ఈ వైద్యులు జిన్నా ఆరోగ్య పరిస్థితిని బయటకు పొక్కనివ్వకపోవడం వల్లే పాకిస్థాన్ ప్రత్యేక దేశంగా ఆవిర్భవించగలిగిందని పాక్ యంత్రాంగం భావిస్తోంది. ఈక్రమంలోనే.. తమ దేశ ఆవిర్భావంలో పరోక్షంగా కీలక పాత్ర పోషించిన ఈ ఇద్దరు పార్శీ డాక్టర్లకు మరణానంతరం 'నిషాన్-ఎ-ఇంతియాజ్' అవార్డును ప్రకటిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రణాళికా శాఖ మంత్రి ఎహసాన్ ఇక్బాల్ వెల్లడించారు.ఆ సమాచారం తెలిసుంటే చరిత్ర మారేదా?జిన్నా ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్నారనే విషయం ఆ రోజుల్లోనే వెలుగులోకి వచ్చి ఉంటే.. బహుశా విభజన ప్రక్రియ ఆగిపోయేదేమోనన్న చర్చ కూడా చరిత్రకారుల్లో ఉంది. నాటి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ సైతం ఈ విషయంపై గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జిన్నా అనారోగ్యం గురించి తమకు ముందుగానే తెలిసి ఉంటే విభజన నిర్ణయాన్ని వాయిదా వేసే వాళ్లమని, అదే జరిగి ఉంటే
Actor ProfilePolitician
పాకిస్థాన్ ఏర్పడేందుకు కారణమైన రహస్యాన్ని దాచిన.. ఇద్దరు ముంబై వైద్యులకు పాక్ అత్యున్నత పౌర పురస్కారం
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•20 Jan 2027
పాకిస్థాన్ ఏర్పడేందుకు కారణమైన రహస్యాన్ని దాచిన.. ఇద్దరు ముంబై వైద్యులకు పాక్ అత్యున్నత పౌర పురస్కారం