మహిళలపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా మానవ మృగాలు ఆడవాళ్లపై దాడి చేస్తూనే ఉన్నాయి. కొందరు ధైర్యం చేసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేస్తుంటే.. ఇంకొందరు పరువు పేరుతో ఇంట్లోనే ఉండిపోతున్నారు. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికి భయపడి మరికొందరు ఆగిపోతున్నారు. అలాంటి బాధితుల కోసం ప్రభుత్వం కొత్తగా పోక్సో ఈ బాక్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. పోలీసుల వద్దకు వెళ్లకుండానే వివరాలు రహస్యంగా ఉంచి బాధ్యులను శిక్షించేందుకు కేంద్రం ఈ యాప్‌ను తీసుకొచ్చింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో ఈ యాప్ పని చేయనుంది. ముఖ్యంగా చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరిగితే వెంటనే స్పందించేలా వ్యవస్థను రూపొందించారు. ఈ యాప్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నాయి. బాధితులు ఎవరైనా ఉంటే ఈ యాప్‌లో ఫిర్యాదు చేస్తే మనం బయటకు రాకుండానే సత్వర న్యాయం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.READ ALSO ఐటీఐ.. ఇక స్మార్ట్‌గా చదివెయ్! విద్యార్థుల కోసం భారత్ స్కిల్స్ యాప్ఇలాంటి నేరాలపై ఫిర్యాదు చేయొచ్చుఆడపిల్లలపై శారీరక వేధింపులు చేసిన సమయంలో ఈ యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు. అదేవిధంగా ఫోన్‌లో కానీ, సోషల్ మీడియాలో కానీ బ్లాక్‌మెయిల్ చేసిన ఫిర్యాదు చేయొచ్చు. ఆట స్థలం, మైదానం, పాఠశాల, ట్యూషన్, స్కూల్ బస్, వ్యాన్ ఎక్కడైనా సరే శారీరక వేధింపులకు గురి చేసినా.. ఫోన్ లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా బ్లాక్‌మెయిల్ చేస్తే కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా లైంగిక వేధింపులు, సైబర్ నేరాలకు పాల్పడినా ఫిర్యాదు చేయొచ్చు.ఫిర్యాదు ఇలా చేయాలిగూగుల్ ప్లే స్టోర్ నుంచి పోక్సో ఈ బాక్స్ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ అయిన తర్వాత పోక్సో ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మనకు ఆట స్థలం, పాఠశాల, ఇంటర్నెట్, కుటుంబ సభ్యులు, ఇతర ప్రదేశాలు అని సూచిస్తూ ఆరు చిత్రాలు కనిపిస్తాయి. మీకు
Actor ProfilePolitician
పోక్సో ఈ బాక్స్.. ఆడపిల్లలకు అండగా పోక్సో యాప్.. పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఫిర్యాదు చేసుకోవచ్చు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•19 Jan 2027
పోక్సో ఈ బాక్స్.. ఆడపిల్లలకు అండగా పోక్సో యాప్.. పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఫిర్యాదు చేసుకోవచ్చు