
Pakistan Petrol Price : పాకిస్థాన్ దేశంలో ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉధ్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా పాక్ సర్కార్ పెట్రోల్ ధరను లీటరుకు రూ.3.34, హైస్పీడ్ డీజిల్ ధరను రూ.5.27 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పెంచిన ధరలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.334.54కు చేరగా.. హైస్పీడ్ డీజిల్ ధర రూ.395.69కు చేరింది. అంతకుముందు పెట్రోల్ రూ.331.20గా, డీజిల్ రూ.390.42గా ఉంది. అంటే ఒక్క రోజులోనే వినియోగదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవల పెట్రోలియం ధరల సమీక్షను రోజువారీ ప్రాతిపదికన చేపట్టే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు, దిగుమతి వ్యయాలు, మారకపు విలువ తదితర అంశాల ఆధారంగా ధరల్లో మార్పులు చేస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు దేశీయ వినియోగదారులపై ఆ ప్రభావం త్వరగా పడుతోంది. పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రోజువారీ ధరల నిర్ణయంలో అంతర్జాతీయ మార్కెట్ ధరలకు సంబంధించిన ఏడు రోజుల సగటును పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రపంచ చమురు మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్న సమయంలో దేశీయ ధరలను అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేయడమే ఈ విధానం లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న పరిస్థితుల కారణంగా చమురు రవాణా, సరఫరా మార్గాలు, షిప్పింగ్ ఖర్చులపై అనిశ్చితి పెరిగింది. పాకిస్థాన్ తన ఇంధన అవసరాల్లో కొంత భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరల్లో మార్పులు అక్కడి దేశీయ ఇంధన ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాకిస్థాన్‌లో రవాణా రంగంపై