
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డమ్ ని పీక్ కి తీసుకెళ్లిన చిత్రం పోకిరి. సాధారణ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అసాధారణంగా రికార్డులు నెలకొల్పింది. 40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పోకిరికి ముందు మహేష్ వేరు.. పోకిరి నుంచి అభిమానులు చూసిన మహేష్ వేరు అనే చెప్పాలి. పోకిరి మూవీలో మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ మొత్తం డైరెక్టర్ పూరి జగన్నాధ్ మార్చేశారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మహేష్ బాబు ఐపీఎస్ అధికారి అని రివీల్ చేసే సన్నివేశం అయితే గూస్ బంప్స్ తెప్పించింది. మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో పోకిరి మూవీలో తనకు బాగా ఇష్టమైన సన్నివేశం గురించి మాట్లాడారు. సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజ్, నాజర్ మధ్య వచ్చే సీన్ తన ఫేవరెట్ అని మహేష్ అన్నారు. అన్ని సినిమాల్లో అలాంటి ఎమోషన్ ఉన్న సన్నివేశం కుదరదు అని మహేష్ తెలిపారు. ఇలియానా గురించి కూడా మహేష్ స్పందించారు. ఇలియాన్ డెడికేషన్ ఉన్న నటి. పోకిరి తర్వాత ఆమె చాలా కాలం ఇండస్ట్రీలో ఉంటుంది అని మహేష్ అన్నారు. హీరోయిన్ తో వచ్చే సన్నివేశాల గురించి యాంకర్ ప్రశ్నించారు. ఇలియానాతో వచ్చే సన్నివేశాలు కొన్ని ఎమోషనల్ గా, కొన్ని ఫన్నీగా ఉన్నాయి. లిఫ్ట్ సీన్ అయితే ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. దాని గురించి ఏమంటారు అని ప్రశ్నించగా మహేష్ బాబు సమాధానం ఇచ్చారు. లిఫ్ట్ సీన్ చేస్తున్నప్పుడు నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే అందులో రియల్ ఎమోషన్ ఉంది. అది సినిమాలో జరుగుతున్న సీన్ లా ఉండదు. ఒక అబ్బాయి, అమ్మాయి అనుకోకుండా షాపింగ్ మాల్ లో లిఫ్ట్ లో ఇరుక్కుపోవడం అనేది ఎక్కడైనా జరగొచ్చు అని మహేష్ బాబు అన్నారు. ఈ