
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. గత వారం రోజులుగా షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కోసం తాత్కాలికంగా నిలిపివేసిన పీఎఫ్ పాస్‌బుక్ పోర్టల్‌ను అధికారులు మళ్లీ రీస్టార్ట్ చేశారు. అంటే, ఇక నుంచి పీఎఫ్ ఖాతాదారులు ఎప్పటిలాగే తమ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ స్టేట్‌మెంట్లను ఆన్‌లైన్‌లో ఈజీగా చూసుకోవచ్చు. డేటాబేస్ కలపడం, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ పనుల కోసం జూన్ చివరి వారం నుంచి ఈ పోర్టల్‌ను తాత్కాలికంగా ఆపేశారు. ఇప్పుడు అప్‌గ్రేడ్ ప్రాసెస్ పూర్తి కావడంతో మళ్లీ పోర్టల్ లైవ్‌లోకి వచ్చింది. అయితే, ప్రస్తుతం రీసెంట్‌గా ప్రాసెస్ చేసిన అకౌంటింగ్ సంవత్సరాల ట్రాన్సాక్షన్లు మాత్రమే పోర్టల్‌లో కనిపిస్తున్నాయని అధికారులు ఒక నోటీసులో స్పష్టం చేశారు. పాత సంవత్సరాల డేటా కూడా త్వరలోనే అప్‌డేట్ అవుతుందని, దీని కోసం యూజర్లు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ పనితీరును మరింత పెంచడానికి, సెక్యూరిటీని స్ట్రాంగ్ చేయడానికి, నమ్మకాన్ని పెంపొందించడానికి జూన్ 26 నుంచి ఈ మైగ్రేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. మెంబర్స్, ఎంప్లాయర్స్ కోసం సర్వీసులను విడతల వారీగా రీస్టార్ట్ చేసినప్పటికీ, అదనపు వెరిఫికేషన్లు, వాలిడేషన్ చెక్స్ వల్ల పీఎఫ్ క్లెయిమ్‌లు, ఇతర సర్వీస్ రిక్వెస్ట్‌లలో రాబోయే రెండు వారాల పాటు కొద్దిగా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని సంస్థ తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2025-26 కు గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 8.25 శాతం వార్షిక వడ్డీని జూలై 15 నుంచి సబ్‌స్క్రైబర్ల అకౌంట్లలో వేయడానికి ఈపీఎఫ్ఓ రెడీ అవుతోంది. కరెక్ట్‌గా వడ్డీ క్రెడిట్ అయ్యే టైమ్‌కంటే ముందే ఈ పోర్టల్ అందుబాటులోకి రావడం విశేషం. ఈ నెల ప్రారంభంలోనే అప్‌గ్రేడ్ చేసిన యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌ను కూడా ఫేజ్ ల వారీగా అందుబాటులోకి తెచ్చారు. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) యాక్టివేషన్ ప్రాసెస్‌లో ఈపీఎఫ్ఓ ఒక కీలక మార్పు చేసింది. ఇకపై