పస్తులున్నా పోస్టుల్లేకపాయె
Actor ProfilePolitician

పస్తులున్నా పోస్టుల్లేకపాయె

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పస్తులున్నా పోస్టుల్లేకపాయె
Sakshi23 Nov 2026
పస్తులున్నా పోస్టుల్లేకపాయె

నిరుద్యోగులను నిరాశ పరిచిన పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఖాళీలు ఎక్కువగా ఉన్నా.. సగం పోస్టులకు మాత్రమే జారీ చాలా జిల్లాలు, జోన్లలో సింగిల్‌ డిజిట్‌ పోస్టులే ‘క్యూర్‌’పరిధిలో భర్తీకి కానిస్టేబుల్‌ పోస్టులే లేవు 26 జిల్లాల్లో మాత్రమే సివిల్, ఏఆర్‌ కానిస్టేబుల్‌ పోస్టులు జోన్‌–3, 5, 6, 7 పరిధిలో ఆర్‌ఎస్‌ఐ–ఏఆర్‌ పోస్టులు సున్నా జిల్లాలు, జోన్ల వారీగా బ్యాలెన్స్‌ తప్పిందంటున్న ఆశావహులు తదుపరి నోటిఫికేషన్‌కు వయసు గండం...అనర్హులు కానున్న అభ్యర్థులు పోస్టులే కేటాయించలేదు ఈ ఫొటోలో కనిపిస్తున్నది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన గుడ్ల శ్రీకాంత్‌. పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం రెండున్నర ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే ఒక దఫా కోచింగ్‌ పూర్తి చేసిన శ్రీకాంత్‌ మరో ఆరు నెలలు రెండో విడత కోచింగ్‌కు కూడా వెళ్లాడు. తాజాగా వెలువడిన నోటిఫికేషన్‌లో రంగారెడ్డి జిల్లాకు కానిస్టేబుల్‌ పోస్టులే కేటాయించలేదు. దాదాపు మూడేళ్లుగా చేసిన సన్నద్ధత వృథా కావడంతో శ్రీకాంత్‌ తీవ్ర గందరగోళంలో పడిపోయాడు. పరిమిత సంఖ్యలో పోస్టులు ఉన్నా కష్టపడి ఉద్యోగం కొట్టేందుకు ప్రయతి్నస్తుండేవాడినంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సాక్షి, హైదరాబాద్‌: వేల సంఖ్యలో నిరుద్యోగులున్నా అందుకు తగ్గ ఖాళీలే లేవు..మరోవైపు ఖాళీలు ఎక్కువగా ఉన్నా ..సగం పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ జారీ చేశారు..తెలంగాణ పోలీసు నియామకాల బోర్డు(టీజీపీఆర్‌బీ) తీరుపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ మెజార్టీ జిల్లాల నిరుద్యోగులను నిరుత్సాహపరిచింది. తాజా నోటిఫికేషన్‌లో కేవలం 26 జిల్లాలకు మాత్రమే పోస్టులను నిర్దేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో ఒక్క పోస్టును కూడా ప్రకటించలేదు. ‘క్యూర్‌’పరిధిలో కానిస్టేబుల్‌ పోస్టులు లేనేలేవు. మరోవైపు పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల తదితర జిల్లాల్లోనూ పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులు అసలే లేవు. జిల్లాలు, జోన్ల వారీగా సమన్యాయం పాటించలేదని, దీంతో చాలా జిల్లాలు, జోన్ల పరిధిలోని అభ్యర్థులకు