
భారతదేశ ఉన్నత విద్యా నియంత్రణ వ్యవస్థను పూర్తిగా మార్చివేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విక్షిత భారత్ శిక్షా అధిష్ఠాన్ (VBSA) బిల్లు-2025 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే తీవ్ర వివాదాస్పదంగా మారింది. దేశంలోని ఉన్నత విద్యా రంగ నియంత్రణ సంస్థలైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE)ల స్థానంలో ఒకే ఒక సర్వోన్నత సంస్థగా ఈ విబిఎస్ఏ (VBSA)ను ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.అయితే, ఈ ప్రతిపాదనపై కేవలం విపక్షాలే కాకుండా, కేంద్రంలోని బీజేపీ మిత్రపక్షాలైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో ఈ బిల్లుపై జాతీయ స్థాయిలో పెద్ద చర్చ నడుస్తోంది.ఈ బిల్లును పరిశీలిస్తున్న ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ (JPC)కి పలు రాష్ట్రాలు ఇప్పటికే తమ లిఖితపూర్వక అభ్యంతరాలను సమర్పించాయి. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీకి అత్యంత కీలకమైన మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ (TDP) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బిల్లుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ బిల్లు వల్ల ఉన్నత విద్యపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే శాసన అధికారాలు పూర్తిగా నిర్వీర్యమైపోతాయని ఏపీ ఆందోళన వ్యక్తం చేసింది. పురందేశ్వరి చేతుల్లో కొత్త విద్యా చట్టం.. ఒకే దేశం, ఒకే విద్యా కమిషన్!రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు డిగ్రీలు మంజూరు చేసే ప్రక్రియలో రాష్ట్రాలను కాదని కేంద్రం నేరుగా జోక్యం చేసుకోవడం వల్ల రాజ్యాంగపరమైన ఘర్షణలు (Constitutional Friction) తలెత్తుతాయని హెచ్చరించింది. ఏపీతో పాటు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, మిత్రపక్షం నేతృత్వంలోని మేఘాలయ, కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాష్ట్రాలు కూడా ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వానికి మితిమీరిన అధికారాలు కట్టబెడుతూ, రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తోందని ఆరోపించాయి.బిల్లులో వివాదాస్పద క్లాజులు.. వర్సిటీల గుబులు!బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) వంటి ప్రతిష్టాత్మక కేంద్ర విశ్వవిద్యాలయాలతో పాటు