పవన్ కోలుకున్న తర్వాత.. ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన
Actor ProfilePolitician

పవన్ కోలుకున్న తర్వాత.. ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పవన్ కోలుకున్న తర్వాత.. ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన
Telugu Times6 Nov 2026
పవన్ కోలుకున్న తర్వాత.. ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో త్వరలోనే ఒక భారీ రాజకీయ ప్రక్షాళన జరగబోతోందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (Cabinet Reshuffle) దిశగా అధిష్టానం కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి కొంతకాలం గడుస్తున్న నేపథ్యంలో, కొందరు మంత్రుల పనితీరును బేరీజు వేస్తూ క్యాబినెట్‌లో మార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గత కొంతకాలంగా తీవ్రమైన భుజాల నొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో రెండు భుజాల్లో తీవ్రమైన రొటేటర్ కఫ్ గాయాలు, కండరాల చీలికలు ఉన్నట్లు తేలింది. దీనితో గత శనివారం ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో ఆయనకు దాదాపు మూడున్నర గంటల పాటు కుడి భుజానికి మేజర్ సర్జరీ విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు ముంబై ఆస్పత్రికి వెళ్లి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సలహా ప్రకారం పవన్ కళ్యాణ్ కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు. ఆయన కోలుకుని తిరిగి అమరావతికి వచ్చిన వెంటనే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ భేటీలోనే మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళనకు సంబంధించిన అసలైన కీలకమైన స్కెచ్ గీయబోతున్నారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, మరియు బీజేపీ నేతల మధ్య సమన్వయం దెబ్బతినకుండా, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ మంత్రివర్గ ప్రక్షాళనలో కేవలం “పనితీరు” మాత్రమే ఏకైక ప్రామాణికంగా ఉండబోతోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆయా శాఖల్లో ఆశించిన స్థాయిలో రాణించని మంత్రులను మార్చడం లేదా వారి పోర్ట్‌ఫోలియోలను మార్చడం వంటివి జరిగే అవకాశం

పవన క ల క న న తర వ త ఏప మ త ర వర గ ప రక ష ళన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in