పవన్ కళ్యాణ్ చేస్తే ఫ్లాప్
Actor ProfileActor

పవన్ కళ్యాణ్ చేస్తే ఫ్లాప్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పవన్ కళ్యాణ్ చేస్తే ఫ్లాప్, రవితేజ చేస్తే సూపర్ హిట్.. ఒకే కథతో రెండు సినిమాలు
Asianet News Telugu4 Jan 2027
పవన్ కళ్యాణ్ చేస్తే ఫ్లాప్, రవితేజ చేస్తే సూపర్ హిట్.. ఒకే కథతో రెండు సినిమాలు

చిత్ర పరిశ్రమలో చాలా సినిమాలు ఒక ఫార్ములా ప్రకారం ఉండే కథలతో తెరకెక్కుతుంటాయి. ఇప్పుడంటే ఫార్ములా కథలకు ట్రెండ్ పోయింది. కానీ గతంలో సినిమా అంటే ఫ్లాష్ బ్యాక్, కొన్ని పాటలు, కొన్ని ఫైట్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ క్రమంలో చాలా సినిమాల కథలు ఒకే రకంగా అనిపించేవి. కథ మొత్తం కాకున్నా కొన్ని అంశాలు అయినా ఒకేలా అనిపించేవి. కొన్ని సినిమాల కథలు మాత్రం దాదాపు ఒకేలా ఉండేవి. పవన్ కళ్యాణ్, రవితేజ సినిమాలు కూడా ఒకే తరహా కథతో తెరకెక్కి విభిన్న ఫలితాలని అందుకున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్, కరుణాకరన్ కాంబినేషన్ లో తెరకెక్కిన బాలు చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ లో హీరో ఒక డాన్. హీరోయిన్ మరణంతో మార్పు వస్తుంది. తన ఐడెంటిటీ మార్చుకుని హీరో తిరుగుతుంటాడు. ఈ క్రమంలో మరో హీరోయిన్ తో లవ్ ట్రాక్ ఉంటుంది. ఈ కథ ఆ టైం లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సెట్ కాలేదు. పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు స్టైలిష్ మూవీస్, యూత్ ఫుల్ చిత్రాలు, లవ్ స్టోరీలు మాత్రమే ఆశించారు. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో బలుపు చిత్రం తెరకెక్కింది. ఇది కూడా బాలు తరహా కథే. ఫ్లాష్ బ్యాక్ లో రవితేజ డాన్. విలన్లతో గొడవల వల్ల హీరోయిన్ చనిపోతుంది. హీరోయిన్ కోరిక మేరకు గొడవలకు దూరంగా ఉంటూ ఆమె తండ్రితో రవితేజ కొత్త జీవితం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో శృతి హాసన్ తో పరిచయం ఏర్పడుతుంది. ఈ మూవీలో మాస్ అంశాలు, కామెడీ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. అందుకే ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. దర్శకుడు కరుణాకరన్ మంచి కథని ఎంచుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సరిపడని విధంగా స్క్రీన్ ప్లే రూపిందించారు