పవన్ కళ్యాణ్ గారేంటి నాతో జోక్స్ వేస్తున్నారు అనుకున్నా
Actor ProfileActor

పవన్ కళ్యాణ్ గారేంటి నాతో జోక్స్ వేస్తున్నారు అనుకున్నా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పవన్ కళ్యాణ్ గారేంటి నాతో జోక్స్ వేస్తున్నారు అనుకున్నా - సంగీత దర్శకుడు అజయ్ అరసాడ
TeluguOne8 Jan 2027
పవన్ కళ్యాణ్ గారేంటి నాతో జోక్స్ వేస్తున్నారు అనుకున్నా - సంగీత దర్శకుడు అజయ్ అరసాడ

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లతో సంగీత దర్శకుడిగా అజయ్ అరసాడ తెలుగు ప్రేక్షకుల్లో ఓ ముద్ర వేశారు. వరస ఆఫర్లతో మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతోన్న అజయ్ అరసాడ తన సినీ జర్నీని షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే.. మీ నేపథ్యం గురించి చెప్పండి? మా ఫ్యామిలీ, నా రక్తంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉంది. మాది వైజాగ్. టీసీఎస్‌లో ఉద్యోగం కూడా చేశాను. ఏడేళ్లు జాబ్ చేశాను. అలా జాబ్ చేస్తుండగానే రెండు సినిమాలకు పని చేశాను. నాకు దేవీ శ్రీ ప్రసాద్ స్పూర్తి. మా అమ్మ, భార్య సపోర్ట్ వల్లే నేను ఈ ఇండస్ట్రీలోకి రాగలిగాను. వైజాగ్‌లోనే శ్రీ చరణ్ నాకు మంచి ఫ్రెండ్. ‘గూఢచారి’కి నన్ను కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా తీసుకున్నాడు. చిన్న చిత్రాల్ని చేస్తుండటంలో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? చిన్న చిత్రాలకు పని చేయడం వల్ల నాకు ఎక్కడా ఇబ్బంది కలగలేదు. మంచి ప్రొడక్షన్స్ కావడం వల్ల ఎప్పుడూ కూడా పేమెంట్స్ విషయంలో తేడా రాలేదు. ఈ క్రమంలో నాకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురు కాలేదు. మీకంటూ ఓ ప్రత్యేకత ఏర్పడాలని ప్రయత్నిస్తున్నారా? అన్ని రకాల జానర్‌లు, కథల్ని చేయాలని అనుకుంటున్నాను. నా వద్దకు వచ్చిన కథకు న్యాయం చేయాలని చూస్తాను. నా వద్దకు మాస్ కథ వస్తే.. మాస్ మ్యూజిక్ వస్తుంది. బడ్జెట్‌ను పట్టి మ్యూజిక్ మారుతుందా? ఒక్కో సింగర్ ఒక్కోలా ఛార్జ్ చేస్తారు. నా పాటకు ఎవరు సెట్ అవుతారు అని అనుకుంటే వారితోనే ప్రొసీడ్ అవుతాను. ఎందుకంటే ఫైనల్‌గా అది నా పాట. జీవితాంతం నిలిచే పోయే పాటగా ఉండాలని చూస్తాను. కెరీర్‌ స్టార్టింగ్‌లో అనురాగ్ కులకర్ణితో పాడిస్తా అని అంటే ఓ నిర్మాత వద్దని అన్నాడు. ఇప్పుడు ఆ నిర్మాతే అనురాగ్‌తో పాడించుకునే స్థాయిలో లేడు (నవ్వుతూ). థియేటర్‌

పవన కళ య ణ గ ర ట న త జ క స వ స త న న ర అన క న న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in