
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Pawan Kalyan Health Update: అయితే ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక సమావేశాలు పూర్తి చేసిన తర్వాతే శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఆ కార్యక్రమాలన్నీ ముగిసిన అనంతరం ముంబయికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. వైద్యుల సూచన మేరకు రెండు భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేయలేదు. అలా చేస్తే నొప్పి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వారు వివరించారు. అందుకే తొలుత కుడి భుజానికి శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ ఆపరేషన్ దాదాపు మూడున్నర గంటల పాటు సాగిందని వైద్యులు తెలిపారు. మరో భుజానికి రెండు నెలల తర్వాత శస్త్రచికిత్స చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌కు భుజం సమస్య కొత్తది కాదు. 2016లో ఆయనకు భుజానికి గాయం కావడంతో చికిత్స తీసుకున్నప్పటికీ, విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారు. కానీ ప్రజా కార్యక్రమాలు, పార్టీ బాధ్యతల కారణంగా ఆయన పూర్తి విశ్రాంతి తీసుకోలేకపోయారు. 2018లో నిర్వహించిన పోరాట యాత్ర, ఆ తర్వాత జరిగిన పలు ప్రజా పర్యటనలు, ఎన్నికల ప్రచారాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనతో కరచాలనం చేయడానికి, దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించేవారు. ఈ సమయంలో భుజాలపై ఒత్తిడి పెరగడంతో గాయాలు మరింత తీవ్రమయ్యాయి. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రజల మధ్య కార్యక్రమాలు కొనసాగిస్తూ నొప్పిని భరించారు. ఇటీవల జరిగిన వైద్య పరీక్షల్లో భుజాల్లో రొటేటర్ కఫ్ గాయాలతో పాటు కండరాలు కూడా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇలాంటి పరిస్థితిలో