
ఇంటర్నెట్ డెస్క్: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) శనివారం ముంబయిలో శస్త్రచికిత్స జరిగింది. ఇటీవల వైద్యపరీక్షలు చేయించుకున్నప్పుడు ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ గాయాలు ఉన్నాయని.. కండరాలు పూర్తిగా చిట్లడంతో శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. రెండు భుజాలకూ ఒకేసారి శస్త్రచికిత్స చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. నేడు కుడి భుజానికి చేశారు. దీనికి మూడున్నర గంటల సమయం పట్టిందని.. రెండు నెలల వ్యవధిలో మరో సర్జరీ చేయాల్సి ఉంటుందన్నారు (Pawan Kalyan surgery). పవన్ త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో పవన్‌కు దెబ్బలు తగిలాయి. 2019లో రాయలసీమ జిల్లా పర్యటనలోనూ, వారాహి యాత్ర సమయంలోనూ ఆయనకు గాయాలు అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో పవన్ ముక్కుకి శస్త్ర చికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించగా.. రొటేటర్ కఫ్ గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పవన్‌కు శస్త్రచికిత్స విజయవంతం అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని నిర్మాత బండ్ల గణేశ్ పోస్ట్ పెట్టారు. ఆయన తర్వగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు