పళ్ళ బురుసు’
Actor ProfileActor

పళ్ళ బురుసు’

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పళ్ళ బురుసు’ పై ప్రశంసలు కురిపించిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్
Telugu Times6 Jan 2027
పళ్ళ బురుసు’ పై ప్రశంసలు కురిపించిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్

అన్నపూర్ణ స్టూడియోస్ లేటెస్ట్ హిట్ ‘పళ్ళ బురుసు’. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. తాజాగా బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ‘పళ్ళ బురుసు’ సినిమాను ప్రశంసిస్తూ తన రివ్యూను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “బ్యూటిఫుల్ ఫిల్మ్. చాలా సింపుల్‌గా ఉంటుంది.. మీ ముఖంపై చిరునవ్వును అలాగే ఉంచుతుంది. ఒకదానికొకటి కాపీలా అనిపించే నాన్‌స్టాప్ యాక్షన్ సినిమాల నుంచి ఇది చాలా ఫ్రెష్‌గా అనిపించింది” అంటూ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. దర్శకుడు ఉదయ్ చౌహాన్‌పై కూడా అనురాగ్ కశ్యప్ ప్రశంసలు కురిపించారు. “వెంకటేష్ మహా తర్వాత, నన్ను ఇంతగా ఇంప్రెస్ చేసిన దర్శకుడు ఉదయ్ చౌహాన్.” అంటూ ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు ‘పళ్ళ బురుసు’ టీమ్‌లో మరింత జోష్ నింపుతోంది. ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ లాంటి వెటరన్ దర్శకుడి నుంచి వచ్చిన ప్రశంసలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి

పళ ళ బ ర స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in