పర్సనల్ లైఫ్ కాదు.. పాలన
Actor ProfilePolitician

పర్సనల్ లైఫ్ కాదు.. పాలన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పర్సనల్ లైఫ్ కాదు.. పాలన గురించి మాట్లాడండి
Eenadu19 Jan 2027
పర్సనల్ లైఫ్ కాదు.. పాలన గురించి మాట్లాడండి

ఇంటర్నెట్‌ డెస్క్: తమిళనాడులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో సీఎం విజయ్‌కు (Vijay).. నటి త్రిష సెల్యూట్‌ చేయడం తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ అంశం రాజకీయంగా దుమారం రేపగా.. నటి సంజన తాజాగా దీనిపై స్పందించారు. ధైర్యం ఉంటే విజయ్‌ పాలన గురించి మాట్లాడాలని అన్నారు. ఆయన విజయవంతమైన రాజకీయ ప్రయాణాన్ని ఓర్వలేకే.. కొందరు వ్యక్తిగత దాడికి దిగుతున్నారని సంజన విమర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా విజయ్‌ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై సంజన (Sanjjanaa Galrani) ప్రశంసలు కురిపించారు. ప్రజా సమస్యలపై ఆయన త్వరితగతిన స్పందిస్తూ.. ఇతర రాష్ట్రాల ప్రజలను కూడా ఆకర్షిస్తున్నారని అన్నారు. ‘‘విజయ్‌ రాష్ట్రాన్ని సమర్థంగా పరిపాలిస్తున్నారు కాబట్టి.. ఆయనపై ఆరోపణలు చేయలేకపోతున్నారు. వృత్తిపరంగా ఎలాంటి లోపాలు కనిపించనప్పుడు మాత్రమే వ్యక్తిగత ఎజెండాను వెతకడానికి ప్రయత్నిస్తారు. వారి పర్సనల్‌ లైఫ్‌ను లక్ష్యంగా చేసుకుని కించపరచాలని చూస్తారు. విజయ్‌ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. కానీ మహిళలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి రాజకీయాలు ఎప్పటికీ ఆమోదయోగ్యం కావు’’ అని సంజన పేర్కొన్నారు. ఇక త్రిష (Trisha) గురించి సంజన మాట్లాడుతూ.. ఆమె చాలా గొప్ప నటి అని తెలిపారు. సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్నారని అన్నారు. విజయ్‌-త్రిష మధ్య ఉన్న బంధం వారి వ్యక్తిగత విషయమని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా.. ఎదుటి వారి సాన్నిహిత్యాన్ని బట్టి వారి బంధం విషయంలో ఒక నిర్ణయానికి రావడాన్ని సంజన తప్పుపట్టారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు

పర సనల ల ఫ క ద ప లన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in