
తెలంగాణ పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కీలక చర్యలు చేపట్టారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం క్యాంపస్‌లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్: తెలంగాణ పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కీలక చర్యలు చేపట్టారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (MCRHRD) క్యాంపస్‌లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై వారికి కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి. గొల్కొండ సమీపంలోని తారామతి బారాదరిని టూరిజం ప్రాంతంగా మరింత అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మంజీరా, దిల్‌కుషా గెస్ట్ హౌస్‌లను ఆధునికీకరించాలని ఆదేశించారు. టూరిజం హబ్ డెవలప్‌మెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలన్నారు. వికారాబాద్‌లోని వీరభద్రస్వామి దేవాలయాన్ని డెవలప్ చేసి యాదాద్రి తరహాలో ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. క్యూర్ పరిధిలోని అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో భాగ్యనగరంలో ఎకో పార్కులను తీర్చిదిద్దాలని ఆజ్ఞాపించారు. ఫ్యూచర్ సిటీలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నారు. అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఏర్పాట్లు చేయాలని, ఆ ప్రాజెక్టుల కోసం ప్రత్యేక అధికారిని నియమించి పనులను ముమ్మరం చేయాలన్నారు. పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని, బ్రిడ్జిలపై పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవకాశం ఉంటే ట్రాఫిక్‌ను మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలన్నారు ముఖ్యమంత్రి. డిసెంబరులో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌పైనా కసరత్తు ప్రారంభించాలని