పర్యాటక ప్రాంతంగా దుర్గం చెరువు
Actor ProfilePolitician

పర్యాటక ప్రాంతంగా దుర్గం చెరువు

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
పర్యాటక ప్రాంతంగా దుర్గం చెరువు, హైదరాబాద్ కేంద్రంగా ఇక
Oneindia Telugu27 Sept 2026
పర్యాటక ప్రాంతంగా దుర్గం చెరువు, హైదరాబాద్ కేంద్రంగా ఇక

దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారుల‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌ ఆదేశించారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని అధికారులను నిర్దేశించారు. వికారాబాద్‌లోని వీరభద్రస్వామి దేవాలయాన్ని డెవలప్ చేసి యాదాద్రి తరహాలో ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు.గొల్కొండ సమీపంలోని తారామతి బారాదరిని టూరిజం ప్రాంతంగా మరింత అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మంజీరా, దిల్‌కుషా గెస్ట్ హౌస్‌లను ఆధునికీకరించాలని ఆదేశించారు. టూరిజం హబ్ డెవలప్‌మెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలన్నారు. వికారాబాద్‌లోని వీరభద్రస్వామి దేవాలయాన్ని డెవలప్ చేసి యాదాద్రి తరహాలో ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో భాగ్యనగరంలో ఎకో పార్కులను తీర్చిదిద్దాలని ఆదేశించారు. జమిలి, డీలిమిటేషన్ పై కేంద్రం బిగ్ ట్విస్ట్ - విపక్షాలు ఊహించని విధంగా..!!హైదరాబాద్ కేంద్రంగా టూరిజంకాగా, క్యూర్ పరిధిలోని అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నారు. అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఏర్పాట్లు చేయాలని, ఆ ప్రాజెక్టుల కోసం ప్రత్యేక అధికారిని నియమించి పనులను ముమ్మరం చేయాలన్నారు. పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని, బ్రిడ్జిలపై పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవకాశం ఉంటే ట్రాఫిక్‌ను మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలన్నారు ముఖ్యమంత్రి. డిసెంబరులో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌పైనా కసరత్తు ప్రారంభించాలని, సమ్మిట్ కోసం శాఖల మధ్య సమన్వయం కోసం కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు

పర్యాటక ప్రాంతంగా దుర్గం చెరువు
Sakshi27 Sept 2026
పర్యాటక ప్రాంతంగా దుర్గం చెరువు

హైదరాబాద్: దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారుల‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సోమ‌వారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై ప‌ర్యాట‌క అధికారులకు సూచ‌న‌లు చేశారు. పురానాపూల్, హెరిటేజ్ బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్నారు. బ్రిడ్జిలపైన పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయాలని, అవ‌స‌ర‌మైతే ట్రాఫిక్ మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట‌ల్లోని ముఖ్యాంశాలు ⇒ తారామతి బారామతిని టూరిజం ప్లేస్‌గా మరింతగా అభివృద్ధి చేయాలి ⇒ మంజీరా, దిల్ కుషా గెస్ట్ హౌస్‌ల‌ను ఆధునీకరించాలి ⇒ టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలి ⇒ వికారాబాద్‌లో వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసి.. యాదాద్రి తరహాలో ఆల‌య‌ కమిటీ ఏర్పాటు చేయాలి ⇒ క్యూర్ పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలి ⇒ గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్క్‌లు తీర్చిదిద్దాలి ⇒ ఫ్యూచర్ సిటీలో ఉన్న అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ది.. అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఏర్పాట్లు చేయాలి ⇒ అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టుల కోసం స్పెషల్ ఆఫీసర్‌ను నియ‌మంచి పనులను ముమ్మరం చేయాలి ⇒ డిసెంబరులో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌కు కసరత్తు ప్రారంభించాలి ⇒ సమ్మిట్ కోసం డిపార్ట్మెంట్ల‌ మధ్య సమన్వయం కోసం కమిటీలు ఏర్పాటు చేయాలి చ‌ద‌వండి: హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రానికి న‌యా దిశ‌ తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు) మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు) ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు) ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు షాకిచ్చేలా.. గుర్తుపట్టారా? (ఫొటోలు) చంద్రగిరిలో టెన్షన్.. టెన్షన్