పబ్ లో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి
Actor ProfilePolitician

పబ్ లో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పబ్ లో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి
Samayam Telugu5 Nov 2026
పబ్ లో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం కావడంతో రోంగ్ బీర్ నా లాడ్‌ప్రాయో పబ్‌లో జనాలు ఎంజాయ్ చేస్తున్నారు.. ఇంతలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు వ్యాపించాయి.. వెంటనే అక్కడికి నుంచి అందరూ బయటకు రావడానికి ప్రయత్నించారు. వెంటనే భవనం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది.. పబ్‌లో ఉన్నవారు ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు పరుగు తీశారు. కొందరు ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. పబ్‌లోని రెస్ట్‌రూమ్‌లలో మృతదేహాలు గుర్తించారు. ఈ ప్రమాదంలో విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.పబ్‌లో ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దాదాపు గంటపాటూ శ్రమించి పబ్‌లో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలియడంతో థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి అనుతిన్ చార్న్‌విరాకుల్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, అక్కడ సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. ఈ పబ్ ప్రమాదంలో 27మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. పబ్‌లో అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రధాని అనుతిన్ తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా.. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అంతేకాదు పబ్‌లో సరైన ఫైర్ సెఫ్టీ ఉందా? లేదా? అని ఆరా తీస్తున్నారు. థాయ్‌లాండ్‌లో గతంలో కూడా భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. 2009లో బ్యాంకాక్‌లోని శాంతికా నైట్‌క్లబ్‌లో న్యూ ఇయర్ వేడుకలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఆ సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏకంగా 66 మంది చనిపోయారు. 2022లో తూర్పు థాయ్‌లాండ్‌లోని ఒక మ్యూజిక్ పబ్‌లో జరిగిన ప్రమాదంలో 14 మంది మృతిచెందారు. తాజాగా జరిగిన ప్రమాదంలో 27మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. థాయ్‌లాండ్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా బ్యాంకాక్‌కు టూరిస్టుల క్యూ కడుతుంటారు