
భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం సృష్టించిన లెజెండరీ గాయని ఎస్. జానకి గారు. తన అద్భుతమైన గానంతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న ఆమె ప్రస్థానంపై, ప్రత్యేకించి ఆమె పద్మభూషణ్ అవార్డును తిరస్కరించిన సంఘటనపై ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఆసక్తికరమైన విషయాలను ఓ టీవీ ఛానెల్ తో పంచుకున్నారు. జానకమ్మను వ్యక్తిగతంగా తాను ఎలా చూసేవారో, ఆమె సంగీత ప్రపంచానికి ఎలా ప్రేరణగా నిలిచారో ఆయన వివరించారు. ఎస్. జానకి గారి పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి ఆమె అసాధారణ విజయాలు. ఆమె తన కెరీర్‌లో 12 నంది అవార్డులు, 4 జాతీయ అవార్డులు అందుకున్నారు. 48 వేలకు పైగా పాటలు పాడి, ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు. "ఆమె కేవలం ఒక గాయని కాదు, ఒక సంగీత పాఠశాల. ఇళయరాజా గారి సంగీతం, బాలు గారి వాయిస్‌తో పాటు జానకమ్మ గాత్రం తనను సంగీత ప్రపంచంలోకి రావడానికి ప్రధాన ప్రేరణ" అని ఆర్పీ పట్నాయక్ తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి గారు కలిసి సృష్టించిన పాటలు ఒక మ్యాజిక్ అని, ఆ అద్భుతమైన కలయికను సంగీత ప్రియులు ఎప్పటికీ మరిచిపోలేరని ఆయన అన్నారు. బాలు గారిని ఎలా మిస్ అవుతున్నామో, అంతే స్థాయిలో జానకమ్మను కూడా మిస్ అవుతున్నామని పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి : 23 ఏళ్లకే అన్ని చూసేసా.. ప్రేమ పేరుతో చాలా మంది మోసం చేశారు.. నటి ఎమోషనల్ కామెంట్స్ జానకి గారితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, మార్చి 21న తాను చివరిసారిగా ఆమెను కలిశానని ఆర్పీ పట్నాయక్ వెల్లడించారు. వైజాగ్‌లో ఆమెను కలిసినప్పుడు, ఆమెతో ఎంతసేపు ఉన్నా తక్కువే అనిపించేదని, ఆమె ఒక పాజిటివ్ సోల్ అని పేర్కొన్నారు. 87 ఏళ్ల వయసులో కూడా ఆమె ఎంతో యాక్టివ్‌గా, ఉత్సాహంగా ఉండేవారని, అందరితో సులభంగా కలిసిపోయేవారని