
అత్తారింటికి దారేది మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన కన్నడ బ్యూటీ ప్రణీత. ఈ చిత్రంలో తన అందమైన కళ్లతో అభిమానులను కట్టిపడేసింది. తెలుగులో హలో గురు ప్రేమకోసమే అనే చిత్రంలోనూ మెప్పించింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లోనూ మెరిపింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న భామ.. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. సినిమాల్లో లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలను అభిమానులకు తన అప్‌డేట్స్ ఇస్తూ టచ్‌లోనే ఉంటోంది. తాజాగా ప్రణీత సోషల్ మీడియాలో ఓ పిక్ షేర్ చేసింది. ఇవాళ భీమన అమావాస్య కావడంతో తన భర్త కాళ్లకు ప్రత్యేక పూజలు చేసింది. పతిదేవునికి నమస్కరిస్తూ ఉన్న ఫోటోను ట్విట్‌ర్‌లో పంచుకుంది. ఇది చూసిన నెటిజన్స్ భర్త అంటే ఎంత గౌరవమో అని కామెంట్స్ చేస్తున్నారు. భీమన అమావాస్య ఎందుకు చేస్తారంటే.. భీమన అమావాస్య అనేది కర్ణాటక, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆషాఢ మాసంలో పాటిస్తారు. ఈ మాసం చివరి రోజైన అమావాస్య నాడు జరుపుకునే హిందూ సంప్రదాయ పండుగ. ఈ రోజు పవిత్రమైన ఉపవాసంలో ఉంటారు. ఈ రోజును శివపార్వతులకు అంకితంగా భావిస్తారు. ఈ సందర్భంగా మహిళలు తమ భర్తలకు, కుటుంబంలోని పురుషులకు ఆరోగ్యం, దీర్ఘాయువు, శ్రేయస్సుతో ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తారు. ఫేమస్ బ్రిడ్జి దగ్గర హీరోయిన్ మమతా మోహన్ దాస్ (ఫొటోలు) రష్యన్ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ (ఫొటోలు) ప్రకృతి ఒడిలో టాలీవుడ్ హీరోయిన్ యోగా (ఫొటోలు) హైదరాబాద్‌లో ఎయిడ్స్‌పై అవగాహన భారీ ర్యాలీ (ఫోటోలు) ఐదేళ్ల తర్వాత కనిపించిన తెలుగు హీరోయిన్ (ఫొటోలు) పాక్.. సౌదీ.. టర్కీ ఒప్పందం ఒక్కటైన మూడు ముస్లిం దేశాలు.. వైఎస్ జగన్ కర్నూల్ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే మళ్లీ పాత నోట్ల రద్దు? పాత, కొత్త నోట్ల మధ్య తేడా ఇదే