పడవ పాడైంది.. 32 ఏళ్లు దీవిలోనే నివాసం.. ప్రపంచాన్నే ఆకట్టుకున్న వ్యక్తి కథ
Actor ProfileCelebrity

పడవ పాడైంది.. 32 ఏళ్లు దీవిలోనే నివాసం.. ప్రపంచాన్నే ఆకట్టుకున్న వ్యక్తి కథ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పడవ పాడైంది.. 32 ఏళ్లు దీవిలోనే నివాసం.. ప్రపంచాన్నే ఆకట్టుకున్న వ్యక్తి కథ
AP7AM25 Nov 2026
పడవ పాడైంది.. 32 ఏళ్లు దీవిలోనే నివాసం.. ప్రపంచాన్నే ఆకట్టుకున్న వ్యక్తి కథ

మనలో చాలామందికి ఫోన్‌ బ్యాటరీ 20 శాతానికి పడిపోతేనే కంగారు మొదలవుతుంది. కానీ ఇటలీకి చెందిన మౌరో మొరాండి జీవితంలో పడవ ఇంజిన్‌ పాడవడం మాత్రం ఓ కొత్త ప్రపంచానికి తలుపులు తెరిచింది. ప్రయాణం మధ్యలో పడవ ఆగిపోయింది. దాన్ని బాగు చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అతడు.. అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. అలా ఓ చిన్న దీవిలో ఒంటరిగా ఏకంగా 32 ఏళ్లు గడిపాడు.అనుకోకుండా దీవిలోకి..మొరాండి 1939లో ఉత్తర ఇటలీలోని మోడెనా పట్టణంలో జన్మించాడు. గతంలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1989లో నగర జీవితం విసుగు తెప్పించడంతో సముద్ర ప్రయాణం మొదలుపెట్టాడు. పాలినీషియాకు వెళ్లాలని బయలుదేరాడు. కానీ సార్డీనియా ఉత్తర తీరంలోని మద్దలెనా దీవుల సమీపంలో అతడి కాటమరాన్‌ ఇంజిన్‌ పాడైంది.దగ్గర్లోని బుడెల్లీ దీవికి చేరుకున్న అతడికి అక్కడి సంరక్షకుడు త్వరలో బాధ్యతల నుంచి తప్పుకోబోతున్న విషయం తెలిసింది. అంతే.. తన పడవను అమ్మేసి ఆ బాధ్యతను తానే తీసుకున్నాడు.గులాబీ రంగు ఇసుకబుడెల్లీ దీవి ‘పింక్‌ బీచ్‌’తో ప్రసిద్ధి చెందింది. అక్కడి ఇసుకకు గులాబీ రంగు రావడానికి సముద్రంలో ఉండే చిన్న జీవుల అవశేషాలు, పగడాలు, గుల్లలు కారణం. ఈ అరుదైన బీచ్‌ను రక్షించేందుకు 1994లో ఇటలీ ప్రభుత్వం సందర్శకుల రాకను చాలావరకు నిలిపివేసింది.మొరాండి అక్కడి రెండో ప్రపంచ యుద్ధం నాటి ఓ చిన్న ఇంట్లో ఉండేవాడు. దారులను శుభ్రంగా ఉంచేవాడు. ఇసుకపై చెత్త పడకుండా చూసేవాడు. పర్యాటకులకు బీచ్‌ ప్రత్యేకతను వివరించేవాడు. ఇలా మూడు దశాబ్దాలకు పైగా ఆ దీవికి కాపలాదారుగా మారిపోయాడు.ఒంటరితనం.. అతడికి