పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల
Actor ProfilePolitician

పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ధవళేశ్వరం బ్యారేజీకి జలకళ
Eenadu11 Oct 2026
ధవళేశ్వరం బ్యారేజీకి జలకళ

ఎగువన కురుస్తున్న వర్షాలతో రాజమహేంద్రవరం వద్ద గోదావరి జలకళ సంతరించుకుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.9 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 60,933 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 57,387 క్యూసెక్కులను

పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల
Eenadu9 Oct 2026
పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల

పోలవరం: పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను, కృష్ణా జలాలతో అనుసంధానం చేసి.. నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద బుధవారం పూజలు చేసిన ఆయన మోటార్ల స్విచ్ ఆన్‌చేసి పోలవరం కుడి కాలవలోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. 2014-19లో రూ.1300 కోట్లతో నిర్మించిన పట్టిసీమ.. నేడు రూ.50 వేల కోట్ల ఆదాయం సృష్టించిందన్నారు. ఎత్తిపోతల పథకాన్ని గొడ్డలి పార్టీ వట్టిసీమ అని విమర్శించదని.. ఇప్పుడు అదే పథకం ద్వారా ఇప్పటివరకు 450 టీఎంసీలు తరలించామని, దీనికి జగన్‌ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు దూరదృష్టి, ముందుచూపు, నిర్మాణాత్మక ఆలోచన కలిగిన నాయకుడు ఉంటే ప్రజలకు ఏవిధంగా మేలు జరుగుతుందో పట్టిసీమే ఉదాహరణ అని పేర్కొన్నారు. పాలనా అనుభవం లేకపోవడం, విధ్వంసపు ఆలోచనలు, ముందుచూపు లేకపోవడం వల్లే జగన్ పట్టిసీమ వైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. కర్ణాటకలో ఆలమట్టి నుంచి నాగార్జునసాగర్‌ వరకు పాజెక్టులు డెడ్‌స్టోరేజీలో ఉన్నాయని, గోదావరికి ఎగువ నుంచి వస్తున్న నీరు సముద్రంలోకి పోకుండా ఒడిసిపట్టుకుని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పోలవరం, కొవ్వూరు, గోపాలపురం ఎమ్మెల్యేలు సిరి బాలరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి ధర్మరాజు, కలెక్టర్‌ వెట్రిసెల్వి తదిరుతుల పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు