పచ్చబొట్టు ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులా
Actor ProfilePolitician

పచ్చబొట్టు ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పచ్చబొట్టు ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులా
Eenadu23 Oct 2026
పచ్చబొట్టు ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులా

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వ ఉద్యోగానికి (Government Job) దరఖాస్తు చేసే ముందు పచ్చబొట్ల (Tattoo) గురించి కచ్చితంగా ఆలోచించాలా? ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, పారామిలిటరీలో ఉద్యోగానికి పచ్చబొట్లు అడ్డంకిగా మారుతాయా? అవును.. నిజమే. ప్రమోషన్‌కు అన్ని అర్హతలూ సాధించిన ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్లు పచ్చబొట్ల కారణంగా పదోన్నతి కోల్పోయారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అక్కడ కూడా నిరాశే ఎదురైంది. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు.. ప్రమోషన్‌ కోసం పరీక్ష రాసి అన్ని అర్హతలూ సాధించారు. కానీ, వాళ్ల కుడి చేతిపై పచ్చబొట్టు ఉందన్న కారణంతో ఉన్నతాధికారులు వారి ప్రమోషన్‌ నిలిపివేశారు. దీంతో వారిద్దరూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. తాము ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పచ్చబొట్లు ఉన్నాయని, అయినా.. వెంటనే శస్త్ర చికిత్స చేయించుకొని వస్తామని, తమకు పదోన్నతి కల్పించాలని కోరినా కోర్టు తిరస్కరించింది. మరోసారి ప్రమోషన్‌ కోసం ప్రయత్నించుకోవాలని పిటిషనర్లకు సూచించింది. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అభ్యర్థి అనర్హతను నియామక ప్రక్రియ సమయంలోనే గుర్తించాలని, ప్రమోషన్‌ సమయంలోనో, సరిదిద్దుకున్న తర్వాతో కాదని తెలిపింది. భద్రతా బలగాలకు క్రమశిక్షణ, హుందాతనం ఎంతో అవసరం. హెయిర్‌ స్టైల్‌ మొదలుకొని వస్త్రధారణ వరకు ప్రతిదీ నిబంధనల ప్రకారమే ఉంటుంది. ఉన్నతాధికారులను కలిసినప్పుడు, అధికారిక కార్యక్రమాల్లో భద్రతాబలగాలు కుడి చేతితో సెల్యూట్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు చేతిపై పెద్ద పెద్ద పచ్చబొట్లు కనిపిస్తే చూడ్డానికి బాగోదు. అందుకే కేంద్ర హోంమంత్రిత్వశాఖ నూతన నిబంధనల ప్రకారం.. పచ్చబొట్లు ఉన్నవారిని మిలిటరీ, పారామిలిటరీ దళాలకు అనర్హులుగా పేర్కొంటారు. అలాగని, పచ్చబొట్టు ఉన్న ప్రతి ఒక్కరూ అనర్హులు కాదు. దీనికి సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ స్పష్టమైన నిబంధనలను జారీ చేసింది. సెల్యూట్‌ చేసే చేతిపై ఎలాంటి పచ్చబొట్లు ఉండకూడదు. అలాగే ముఖం, మెడ వంటి బయటకు కనబడే భాగాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ

పచ చబ ట ట ఉ ట ప రభ త వ ఉద య గ న క అనర హ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in