నేవీ ఉద్యోగి కుటుంబం అనుమానాస్పద మృతి
Actor ProfileActor

నేవీ ఉద్యోగి కుటుంబం అనుమానాస్పద మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేవీ ఉద్యోగి కుటుంబం అనుమానాస్పద మృతి
Sakshi29 Dec 2026
నేవీ ఉద్యోగి కుటుంబం అనుమానాస్పద మృతి

ముంబై: ముంబైలోని నేవీ నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నావికాదళానికి చెందిన ఒక నావికుడు, అతని భార్య, ఇద్దరు చిన్నారులు తమ నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నావికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే ఇంట్లో రెండు నెలలు, మూడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లల మృతదేహాలు కూడా లభించాయి. ప్రాథమిక పరిశోధనలో పిల్లలు విషప్రయోగం వల్ల మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల నివేదికలు వస్తేనే నిజాలు బయటపడతాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవారు, ఇతర సాక్షుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ దుర్ఘటనకు గల కారణాలు లియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇండియన్ నేవీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. కొలాబాలోని నేవీ నగర్‌లో జరిగిన ఈ దురదృష్టకర సంఘటనలో నావికుడు, అతని భార్య, ఇద్దరు పిల్లలు మృతి చెందారని తెలిపింది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తునకు నావికాదళం పూర్తిగా సహకరిస్తున్నదని పేర్కొంది. ఇది కూడా చదవండి: కుర్చీలో ఇరుక్కుపోయిన మెడ.. షాకింగ్ వీడియో! శ్రీహరి కొడుకు మేఘాంశ్‌ 'ఆస్మాన్' చిత్రం మోషన్ పోస్టర్‌ లాంచ్‌ (ఫొటోలు) హైదరాబాద్‌లో సందడి చేసిన నటుడు సోనూసూద్ (ఫొటోలు) ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌ సంచలన విజయం (ఫొటోలు) ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు) ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) నల్లగొండ జిల్లా రూపా రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్.. సమాధుల నుంచి కొత్త వైరస్? శాస్త్రవేత్తల తీవ్ర హెచ్చరిక! కర్నూల్ లో

న వ ఉద య గ క ట బ అన మ న స పద మ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in