మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ ఏనుగు దంతాల వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వన్యప్రాణుల కొమ్ములు, దంతాలతో తయారుచేసిన వస్తువులను అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే ఈ విషయంలో ఆయన విచారణ ఎదుర్కొంటుండగా, తాజాగా ఈ కేసులో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తన వద్ద 10 ఏనుగు దంతాలు, 13 ఏనుగు దంతాలతో చేసిన 13 విగ్రహాలు ఉన్నాయని మోహన్ లాల్ వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. మోహన్ లాల్ గతంలో తన వద్ద 4 ఏనుగు దంతాలు ఉన్నాయని ప్రకటించారు. ఇప్పుడు మరో 6 దంతాలు ఉన్నాయనే విషయాన్ని వెల్లడించారని వార్తలు వస్తున్నాయి. అలానే ఏనుగు దంతాలతో చేసిన 13 విగ్రహాలు కూడా తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. కేరళ అటవీ శాఖ ఇచ్చిన క్షమాభిక్ష పథకంలో భాగంగా మోహన్ లాల్ తాజాగా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. తన వద్ద ఉన్న దంతాలు, విగ్రహాలలో చాలా వరకు తనకు వారసత్వంగా వచ్చాయని, కొన్ని గిఫ్ట్స్ గా వచ్చాయని మోహన్ లాల్ స్పష్టం చేశారు. మోహన్ లాల్ ప్రకటించిన ఏనుగు దంతాల విగ్రహాలలో రాముడు, కృష్ణుడు, బాలాజీ రూపాలు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. వాటి మొత్తం బరువు సుమారు 46 కిలోలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విగ్రహాలకు అటవీ శాఖ డీఎన్ఏ (DNA) పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.* ఆ సినిమా వల్ల అరెకరం అమ్మేశా.. ‘ఆ నలుగురు’ చూసి కె.విశ్వనాథ్ నన్ను చెంప మీద కొట్టారు: రాజేంద్రప్రసాద్
Samayam Telugu•27 Sept 2026
నా వద్ద 10 ఏనుగు దంతాలు, 13 ఐవరీ విగ్రహాలు ఉన్నాయి’.. మోహన్ లాల్ కీలక ప్రకటన