
ఇంటర్నెట్ డెస్క్: ఒక సినిమా.. మూడు పేర్లు.. దాదాపు నాలుగేళ్ల వివాదం.. ఎట్టకేలకు సడెన్‌గా ఓటీటీలో విడుదల.. కట్ చేస్తే, విడుదలైన తర్వాత కేవలం 48 గంటల్లోనే స్ట్రీమింగ్ నుంచి తొలగింపు..! రెండురోజులుగా నెట్టింట తీవ్ర చర్చనీయాంశమవుతోన్న ‘సత్లుజ్’ చిత్రం పరిస్థితి ఇది. ప్రముఖ నటుడు, గాయకుడు దిల్జిత్ దొసాంజే ప్రధాన పాత్రలో నటించిన ‘సత్లుజ్’ (Satluj) సినిమా విషయంలో అసలేం జరిగిందంటే.. 1990లో వేలాది గుర్తుతెలియని మృతదేహాలను అక్రమంగా దహనం చేయడంపై పరిశోధనలు చేసిన ‘జస్వంత్ సింగ్ ఖల్రా’ జీవితం ఆధారంగా ఈ ఈ బయోపిక్ పొలిటికల్ డ్రామా తెరకెక్కింది. దీనికి హనీ ట్రెహన్ దర్శకత్వం వహించారు. అత్యంత సున్నితమైన చారిత్రక అంశం కావడంతో.. ఈ చిత్రం మొదటి నుంచీ అందరి దృష్టిని ఆకర్షించింది. తొలుత ఈ సినిమాను ‘ఘల్లుఘరా’ (Ghallughara) అనే పేరుతో ప్రకటించారు. ఆ తర్వాత దీని పేరును ‘పంజాబ్ 95’ (Panjab 95)గా మార్చారు. చివరకు ఓటీటీలోకి వచ్చేసరికి ‘సత్లుజ్’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్రం 2022లోనే పూర్తయింది. అయితే సెన్సార్ బోర్డు (CBFC) క్లియరెన్స్ కోసం పంపినప్పుడు వివాదం మొదలైంది. బోర్డు ఈ సినిమాకు ఏకంగా 127 కట్స్ సూచించింది. వీటితో పాటు కొన్ని దృశ్యాలు, సంభాషణలు, సినిమా టైటిల్‌పై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అన్ని మార్పులు చేస్తే సినిమా ఒరిజినల్ కథ దెబ్బతింటుందని మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ కాపీరైట్, సెన్సార్ పోరాటం కారణంగా సినిమా విడుదల దాదాపు మూడేళ్లకు పైగా ఆలస్యమైంది. థియేటర్లలో విడుదల చేయడం కష్టమని భావించిన మేకర్స్, నేరుగా ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. జులై 3న ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా ఈ చిత్రం ‘సత్లుజ్’ పేరుతో జీ5 వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. దీనిపై నటుడు దిల్జిత్ దొసాంజే మాట్లాడుతూ.. ఓటీటీలో ఎలాంటి కట్స్ లేని ఒరిజినల్ వెర్షన్‌ను విడుదల చేశామని, ఒక్క కట్ ఉన్నా తాను