నార్సింగిలో కారు బీభత్సం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి
Actor ProfilePolitician

నార్సింగిలో కారు బీభత్సం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నార్సింగిలో కారు బీభత్సం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి
Andhra Jyothy24 Nov 2026
నార్సింగిలో కారు బీభత్సం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి

హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ షాకోట్‌లో ఎస్‌ఎంపీ స్కూల్ సమీపంలో మహేంద్ర XUV కారు బీభత్సం సృష్టించింది. ఈ కారు ఢీకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతిచెందారు. హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ షాకోట్‌లో ఎస్‌ఎంపీ స్కూల్ సమీపంలో మహేంద్ర XUV కారు బీభత్సం సృష్టించింది. ఈ కారు ఢీకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతిచెందారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని ఈ కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం రాపిడో బైక్‌పై వెళ్తున్న ఇద్దరినీ ఈ కారు ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. అందులో ఒకరికి కాలు విరిగింది. గాయపడిన వారిని ప్రైవేట్ ఆస్పత్రికి నార్సింగి పోలీసులు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత కారును అక్కడే వదిలి నలుగురు యువకులు పరారయ్యారు. కారు నంబర్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. ఢీకొట్టిన కారు శంషాబాద్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ కారు అతివేగంగా దూసుకురావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్‌ సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్

న ర స గ ల క ర బ భత స ర ట ర డ ఆర మ ఉద య గ మ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in