
మారుతున్న కాలంతో పాటు నేరాల స్వరూపం, స్వభావం పూర్తిగా మారిపోయాయని, అందుకు అనుగుణంగా పోలీసింగ్ విధానాల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేరం జరిగిన వెంటనే తొలి గంట (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమని, ఆ సమయంలో కీలక ఆధారాలు చేజారిపోకుండా చూడటమే నేర నియంత్రణలో మొదటి విజయమని ఆయన పోలీసు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం నాడు సచివాలయం నుంచి రాష్ట్ర డీజీపీ మొదలుకొని క్షేత్రస్థాయిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) వరకు సుమారు 1,650 మంది అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో డీజీపీ నుంచి ఎస్‌హెచ్‌ఓ స్థాయి వరకు ఒకేసారి ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల కీర్తి దేశవ్యాప్తంగా మార్మోగాలని, అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.పోలీసులకు పూర్తి స్వేచ్ఛ, గౌరవంప్రజలు ప్రశాంతంగా జీవించాలన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా శాంతిభద్రతలు అత్యంత కీలకమని చంద్రబాబు అన్నారు. "రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు విభాగం ఒక గర్వకారణం. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా మీరంతా వ్యవహరించాలి. ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలి" అని ఆయన సూచించారు. 2019-24 మధ్య పాలకులు గంజాయి, కల్తీ మద్యాన్ని రాష్ట్రానికి పెను సమస్యగా మార్చారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని, వారి గౌరవం పెరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 14,770 ప్రభుత్వ సీసీ కెమెరాలతో పాటు, ప్రైవేటు వ్యక్తుల