నారా బ్రాహ్మణికి అరుదైన గుర్తింపు.. మంత్రి లోకేశ్ హర్షం
Actor ProfilePolitician

నారా బ్రాహ్మణికి అరుదైన గుర్తింపు.. మంత్రి లోకేశ్ హర్షం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నారా బ్రాహ్మణికి అరుదైన గుర్తింపు.. మంత్రి లోకేశ్ హర్షం
Eenadu26 Oct 2026
నారా బ్రాహ్మణికి అరుదైన గుర్తింపు.. మంత్రి లోకేశ్ హర్షం

ఇంటర్నెట్‌డెస్క్‌: హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి (Nara Brahmani)కి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కింది. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫార్చ్యూన్ ఇండియా’ ప్రకటించిన మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ - 2026 జాబితాలో ఆమె చోటు సంపాదించారు. భారతదేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో బ్రాహ్మణి నిలవడం విశేషం. దిల్లీలో జరిగిన ఫార్చ్యూన్ ఇండియా ‘మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ 2026’ సదస్సులో బ్రాహ్మణికి ఈ అవార్డును అందజేశారు. హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్థానంలో రైతుల పాత్ర ఎనలేనిదని, పాల ఉత్పత్తిలో నూతన సాంకేతికతను జోడిస్తూనే.. అన్నదాతల జీవనోపాధిని మెరుగుపరచడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా బ్రాహ్మణి స్పష్టం చేశారు. ఈ అరుదైన గుర్తింపును హెరిటేజ్ ఫుడ్స్ కుటుంబానికి, రైతులకు, సంస్థ ఉద్యోగులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. తన భార్య సాధించిన ఘనతపై మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) హర్షం వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన 100 మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో బ్రాహ్మణి నిలవడం తమకు ఎంతో గర్వకారణమన్నారు. ఇలాగే ప్రతిభను చాటుతూ, నాయకత్వ లక్షణాలతో మరిన్ని అవరోధాలను అధిగమించాలని ఆకాంక్షించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

న ర బ ర హ మణ క అర ద న గ ర త ప మ త ర ల క శ హర ష Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in