Pawan Kalyan Fan Niranjan Demise : తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూ.. జీవితంపై కొండంత ఆత్మవిశ్వాసాన్ని కనబరిచిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ ఇక లేడు. హన్మకొండకు చెందిన ఈ పదిహేడేళ్ల కుర్రాడు అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ.. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. నిరంజన్ మరణవార్త తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మరోవైపు బాలీవుడ్ రియల్ హీరో సోనూసూద్ సైతం నిరంజన్ కుటుంబ సభ్యులను వీడియో కాల్ ద్వారా పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.వీడియో కాల్‌లో మాట్లాడి భరోసా ఇచ్చిన రియల్ హీరో సోనూసూద్!నిరంజన్ మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ నటుడు, రియల్ హీరో సోనూసూద్ వీడియో కాల్ ద్వారా పరామర్శించారు. నిరంజన్ అకాల మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో తాను ఆ కుటుంబానికి పూర్తి అండగా ఉంటానని, భవిష్యత్తులో వారికి ఏ అవసరం వచ్చినా సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని సోనూసూద్ హృదయపూర్వకమైన హామీ ఇచ్చారు.అసలేం జరిగిందంటే..?హన్మకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ పుట్టుకతోనే ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధి బారిన పడ్డాడు. దీనివల్ల అతడి శరీర ఎదుగుదల పూర్తిగా లోపించి, చిన్న వయసులోనే నడవలేని స్థితిలో మంచానికే పరిమితం అయ్యాడు. శరీరం సహకరించకపోయినా.. అతడి మనసంతా పవన్ కళ్యాణ్ పట్ల అభిమానమే నిండి ఉండేది. తన జీవిత కాలంలో ఒక్కసారైనా పవన్ కళ్యాణ్‌ను కలవాలనేది నిరంజన్ ఏకైక కోరిక. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. గత నెలలోనే స్వయంగా హన్మకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లి అతడిని సర్ప్రైజ్ చేశారు. ఆ సమయంలో నిరంజన్‌ను ఆత్మీయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని స్వయంగా అందించారు. తనకు కుక్కపిల్ల అంటే ఇష్టమని నిరంజన్ చెప్పగా
Actor ProfileActor
నిరంజన్ తల్లిదండ్రులకు సోనూసూద్ వీడియో కాల్.. అండంగా ఉంటానంటూ హామీ
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•10 Oct 2026
నిరంజన్ తల్లిదండ్రులకు సోనూసూద్ వీడియో కాల్.. అండంగా ఉంటానంటూ హామీ